https://oktelugu.com/

వాహనదారులకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే రూ.5000 జరిమానా..?

మనలో చాలామంది బైక్, కార్ లలో ఏదో ఒక వాహనాన్ని కలిగి ఉంటారు. అయితే ఆ వాహనాలకు సంబంధించిన సర్టిఫికెట్లు, లైసెన్స్ లను గడువు ముగిసిన తరువాత రెన్యువల్ చేయించుకోవాలనే సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల కేంద్రం గతంలో వాహనాలకు సంబంధించిన రెన్యూవల్ డెడ్ లైన్ గడువును ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. Also Read: కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2020 / 08:51 PM IST
    Follow us on


    మనలో చాలామంది బైక్, కార్ లలో ఏదో ఒక వాహనాన్ని కలిగి ఉంటారు. అయితే ఆ వాహనాలకు సంబంధించిన సర్టిఫికెట్లు, లైసెన్స్ లను గడువు ముగిసిన తరువాత రెన్యువల్ చేయించుకోవాలనే సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల కేంద్రం గతంలో వాహనాలకు సంబంధించిన రెన్యూవల్ డెడ్ లైన్ గడువును ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది.

    Also Read: కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్..?

    కేంద్రం పొడిగించిన గడువు ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లను రెన్యూవల్ చేసుకుంటే మంచిది. ఎక్స్‌పైరీ డాక్యుమెంట్లను వాహనదారులు రెన్యూవల్ చేసుకోకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాహనదారులు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవచ్చు.

    Also Read: 20 రూపాయల కోసం ఆశపడితే లక్షన్నర మాయం.. ఏం జరిగిందంటే..?

    parivahan.gov.in వెబ్ సైట్ ద్వారా కేంద్రం లైసెన్స్ లను రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లో డ్రైవింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఆప్షన్ ను ఎంచుకుని ఆ తరువాత రాష్ట్రం ఎంచుకుని డీఎల్ సర్వీసెస్ ఆప్షన్ లో పూర్తి వివరాలను ఎంటర్ చేసి ఫీజు చెల్లించి లైసెన్స్ లను రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా రెన్యూవల్ చేసుకుంటే కొత్త సంవత్సరంలో ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    డిసెంబర్ 31వ తేదీలోగా వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను రెన్యూవల్ చేసుకోకపోతే 5,000 రూపాయల వరకు జరిమానా చెల్లించే పరిస్థితి ఉంటుంది. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం జరిమానాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అందువల్ల వాహనదారులు జాగ్రత్తలు తీసుకుంటే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.