ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పథకాల అమలులో దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా విద్యారంగ కార్యక్రమాలు.. పథకాలు.. వాటి అమలుకు తీసుకుంటున్న చర్యలు భేష్ అని అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే బెస్ట్ సీఎంగా జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన జగన్మోహన్ రెడ్డి… అందరికీ ఆదర్శమని ఓ అంతర్జాతీయ వేదికపై పలువురు ప్రముఖులు కొనియాడారు.
Also Read: వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త ఆత్మహత్య.. నిలదీసిన పవన్
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విద్యా పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు.. అందరికీ ఆదర్శమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కొనియాడారు. ఏపీలో అమలవుతున్న పథకాలు తమ రాష్ర్టంలోనూ పరిశీలించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీలో ఈనెల 17న నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సు 2020-21 ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండేళ్లుగా ఏపీలో అమలవుతున్న పథకాలను గురించి చాలాసార్లు విన్నామని.. అందులో ముఖ్యంగా చదువు విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకొస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయని కొనియాడారు. గత ఐదేళ్లుగా… ఢిల్లీలో విద్యా సంస్కరణలు తీసుకురావాలని తమ టీం పలు రాష్ట్రాలు తిరిగి వచ్చిందని.., అందులో ఏపీలో అమలవుతున్న విద్యా విధానాలు తమకు ఎంతో నచ్చాయని వివరించారు. ఏపీ టీంలతో మాట్లాడినప్పుడు సీఎం వైఎస్. జగన్ చిత్తశుద్దిని చూశామని కొనియాడారు. సమావేశంలో ఢిల్లీ .. ఏపీ అధికారులు నేరుగా మాట్లాడుకోవడం.. ఇతరులు వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో విద్యావ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
Also Read: వైరల్ : లక్ష్మీపార్వతి ఇంట చిన్న ఎన్టీఆర్ వచ్చాడు!
దీపం ఇంటికి వెలుగును ఇస్తుంది.. చదువు కుటుంబానికి మొత్తంగా జీవితాన్ని ఇస్తుందన్న జగనన్న మాటలు.. అమలు చేస్తున్న పథకాలు.. ఇప్పడు దేశవ్యాప్తంగా మంచి పేరును తీసుకొస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి. ప్రతీ పేద విద్యార్థి.. చదువుకోవాలనే సంకల్పంతో జగనన్న అమలు చేస్తున్న అమ్మ ఒడి.. జగనన్న విద్యా కానుక, నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పేరు సంపాదించాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు అమలు చేసుకునేందుకు వారధిగా నిలిచాయి….
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్