https://oktelugu.com/

చంద్రబాబును ఛీ అన్న ఎన్టీఆర్.. వైరల్ సాక్ష్యం

ఎన్టీ ఆర్ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక గజపతి రాజు అక్షరాంజలి ఘటించారు. తెలుగువారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం అంటూ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరిస్తూ.. ట్విట్టర్ వేదికగా.. పోస్టు చేశారు. పార్టీ పురోగతికి పాటు పడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. Also Read: జగన్ కు ఇది ఊహించని పరిణామం ఇంతవరకు […]

Written By: , Updated On : January 18, 2021 / 10:55 PM IST
Follow us on

Sanchaita Gajapathi Raju

ఎన్టీ ఆర్ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక గజపతి రాజు అక్షరాంజలి ఘటించారు. తెలుగువారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం అంటూ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరిస్తూ.. ట్విట్టర్ వేదికగా.. పోస్టు చేశారు. పార్టీ పురోగతికి పాటు పడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడది వైరల్ అవుతోంది.

Also Read: జగన్ కు ఇది ఊహించని పరిణామం

ఇంతవరకు బాగానే ఉన్నా.. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అశోక గజపతి రాజు ట్విట్ చేసిన దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ పై కుట్ర చేసిన వారిలో ఒకరైన అశోక గజపతి రాజు .. ఆయన వర్థంతి సందర్భంగా కొనియాడడంపై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ట్విట్టర్ వేదికగా… ఆయన వర్థంతి సందర్భంగా కొనియాడడంపై తీవ్రంగా మండిపడ్డారు.

సోమవారం ట్విట్టర్ వేదికగా సంచయిత స్పందిస్తూ.. పార్టీ పెట్టకుని సొంతకాళ్లపై పైకి వచ్చిన ఎన్టీఆర్ ను పదవినుంచి తప్పించి.. ఆయన మరణానికి కారకులైన వారిలో చంద్రబాబుతో పాటు అశోక గజపతి రాజు ఒకరని కౌంటర్ ఇచ్చారు. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆ నాడు ఎన్టీఆర్ రాసిన లేక ఇది అని ట్విట్టర్లో పోస్టు చేశారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త ఆత్మహత్య.. నిలదీసిన పవన్

ఆనాటి కుట్రలో ఎవరెవరు ఉన్నారన్నదానికి సాక్ష్యం ఈ ఫొటో అని కామెంట్ చేశారు. రాజకీయ సూత్రాలు.. ప్రజలకిచ్చిన మాటలను మట్టిలో కలిపిన అశోక గజపతి రాజు ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అని ఆయన వర్ధంతి రోజున కొనియాడడం చూస్తుంటే.. తోడేలు కన్నీరు కార్చినట్లు ఉందని కామెంట్ చేశారు.

కాగా సంచయిత ట్విట్ చేసిన లేఖలో మొత్తం ఐదుగురి సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి రద్దు చేస్తూ.. ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతి రాజు, విద్యాధర్ రావు, దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి లను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుని ఆ లేఖను స్పీకర్ కు పంపించారు ఎన్టీఆర్.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్