https://oktelugu.com/

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రకటన.. టాలీవుడ్ లో వీరికే

దేశ సినిమా రంగంలోనే ప్రతిష్టాత్మక అవార్డులు ‘దాదా సాహెబ్ ఫాల్కే’. అన్ని కేటగిరీల్లో అత్యుత్తమ చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు సైతం ఈసారి అవార్డులు దక్కాయి. Also Read: అభిజీత్ నిర్ణయానికి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారట ! తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను కేంద్రంలోని కమిటీ సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులంతా కలిసి దక్షిణాది సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. వీటిల్లో బెస్ట్ మూవీ, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 01:56 PM IST
    Follow us on

    దేశ సినిమా రంగంలోనే ప్రతిష్టాత్మక అవార్డులు ‘దాదా సాహెబ్ ఫాల్కే’. అన్ని కేటగిరీల్లో అత్యుత్తమ చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు సైతం ఈసారి అవార్డులు దక్కాయి.

    Also Read: అభిజీత్ నిర్ణయానికి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారట !

    తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను కేంద్రంలోని కమిటీ సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులంతా కలిసి దక్షిణాది సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. వీటిల్లో బెస్ట్ మూవీ, యాక్టర్, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వర్సటైల్ యాక్టర్ ల పేర్లు ప్రకటించారు.

    ఈ క్రమంలోనే తెలుగులో బెస్ట్ మూవీగా నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును యువ నటుడు నవీన్ పొలిశెట్టి దక్కించుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీకి ఈ యువ నటుడు ఫాల్కే అవార్డును పొందడం విశేషం.

    Also Read: క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది !

    ఇక బెస్ట్ డైరెక్టర్ గా ప్రభాస్ సాహో సినిమా తీసిన సుజీత్.. సంగీత దర్శకుడిగా తమన్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా నాగార్జున అవార్డులను సొంతం చేసుకున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్