మహిళా ఎస్ఐ ఆత్మహత్య: సుసైడ్ నోట్ లో షాకింగ్ కామెంట్..

ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బులంద్ షహర్ జిల్లాలోని అనుప్ షహర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న అర్జూ పవార్ తాను అద్దెకు ఉంటున్న ఓ ఇంట్లో ఉరివేసుకోవడం కనిపించింది. చుట్టూపక్కల వారు ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అర్జూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఘటనా స్థలంలో ఓ సుసైడ్ నోట్ లభించింది. […]

Written By: Suresh, Updated On : January 2, 2021 1:58 pm
Follow us on

ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బులంద్ షహర్ జిల్లాలోని అనుప్ షహర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న అర్జూ పవార్ తాను అద్దెకు ఉంటున్న ఓ ఇంట్లో ఉరివేసుకోవడం కనిపించింది. చుట్టూపక్కల వారు ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అర్జూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఘటనా స్థలంలో ఓ సుసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకు తానే కారణమని పేర్కొనడం గమనార్హం.