https://oktelugu.com/

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. ఆ ఆఫర్లను నమ్మొద్దు..?

దేశంలో ఆన్ లైన్ యాప్ ల సహాయంతో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తక్కువ సమయంలో రుచికరమైన భోజనం కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఆన్ లైన్ యాప్ ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి డిస్కౌంట్ కూపన్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ఆఫర్లను నమ్మితే మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. తాజాగా ఒక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2020 / 08:49 PM IST
    Follow us on


    దేశంలో ఆన్ లైన్ యాప్ ల సహాయంతో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తక్కువ సమయంలో రుచికరమైన భోజనం కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఆన్ లైన్ యాప్ ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి డిస్కౌంట్ కూపన్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ఆఫర్లను నమ్మితే మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి.

    తాజాగా ఒక మహిళ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలని భావించి అన లైన్ లో వెతుకుతుండగా సోషల్ మీడియాలో 250 రూపాయలకే ఎన్నో వెరైటీలతో భోజనం అంటూ ఒక ఆఫర్ కనిపించింది. ఆ ఆఫర్ నచ్చడంతో వెంటనే ఆ మహిళ ఆర్డర్ చేయాలని చూడగా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే 10 రూపాయల అడ్వాన్స్ పేమెంట్ చేయాలని ఉంది. ఆ మహిళ వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్, పిన్ నంబర్ ఎంటర్ చేసి 10 రూపాయలు చెల్లించింది.

    మహిళ 10 రూపాయలు చెల్లించిన కొన్ని నిమిషాల్లోనే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి 50,000 వేల రూపాయలు కట్ అయ్యాయి. డబ్బులు కట్ కావడంతో అవాక్కవ్వడం మహిళ వంతయింది. ఏం చేయాలో పాలుపోని మహిళ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

    సోషల్ మీడియాలో ఫేక్ ఆఫర్లను నమ్మితే మాత్రం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేరు తెలియని సైట్ల ద్వారా, గుర్తు తెలియని లింక్ ల ద్వారా షాపింగ్ చేయవద్దని సూచిస్తున్నారు. ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఫేక్ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని నిపుణులు చేస్తున్నారు.