చైనాలోని వూహాన్ లో పుట్టిన మహమ్మారి గత ఏడాది మార్చిలో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచాన్ని గుప్పిటపట్టి లక్షలమంది ప్రాణాలు తీసింది. కోట్ల మందిని బాధితులుగా చేసింది. ఇన్నాళ్లకు ఆ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునే పరిష్కారం దొరికింది.
Also Read: జగన్, చంద్రబాబును సైతం మార్చేస్తున్న బీజేపీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన వేళ ప్రజలకు పంపిణీ కూడా మొదలైంది. భారత్ లో కూడా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచే దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభమైంది.
దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భారీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు ప్రతి సెంటర్లో 100మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది 1075 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్-టీకా పంపిణీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: అమ్మఒడి డబ్బులు జమైన వారికి అలర్ట్.. చేయకూడని తప్పు ఇదే..?
తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్యులు, వైద్యసిబ్బందికి టీకా వేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా టీకా వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్