దేశంలో కారోన భయం, ఆ పార్టీలో వాయిదా భయం!

“ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడ్చాడట..!” ప్రస్తుతం ఆంధ్రాలో వైసీపీ నేతల పరిస్థితి అలానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు కారోన వైరస్ భయంతో వాణికిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు మాత్రం స్థానిక ఎన్నికల వాయిదా పడటంతో వణికిపోతున్నారు. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడటం వారికి తెలనొప్పిగా మారింది. ఏపీలో 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన […]

Written By: Neelambaram, Updated On : March 21, 2020 2:34 pm
Follow us on

“ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడ్చాడట..!” ప్రస్తుతం ఆంధ్రాలో వైసీపీ నేతల పరిస్థితి అలానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు కారోన వైరస్ భయంతో వాణికిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు మాత్రం స్థానిక ఎన్నికల వాయిదా పడటంతో వణికిపోతున్నారు. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడటం వారికి తెలనొప్పిగా మారింది.

ఏపీలో 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై రాష్ట్రం లో పెద్ద దుమారమే రేగింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో గొడవ ముగిసింది. అంతే కాకుండా కారోనని కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ ఏపీని షట్ డౌన్ చేసింది.

అయితే కారోన వ్యాప్తితో ఎన్నికల వాయిదా, ఏపీని షట్ డౌన్ చేయడం వంటి కీలక నిర్ణయాలు వెంటవెంటనే జరిగిపోవడంతో అప్పటికే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి.. ఎందుకంటే ఎన్నికలలో ఇతర పార్టీ వారిని భయభ్రాంతులకు గురిచేసి వారిని నామినేషన్లు వేయకుండా చేశారనే అప్రతిష్ట జగన్ సర్కార్ మూట కట్టుకొంది. ప్రస్తుతం టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికలను మొదటినుంచి నిర్వహించాలని ఎన్నికల సంఘం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయం పై కోర్ట్ కి వెళ్లనున్నట్లు సమాచారం. ఒకవేళ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థికభారంతో పాటు పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉందని ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆరు వారాల పాటు తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను పోషించడం కష్టమవుతోందని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు.