https://oktelugu.com/

అనూహ్యంగా ఓటింగ్ లో అభిజిత్ రెండో స్థానానికి!

బిగ్ బాస్ షోకి ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి రీత్యా అనేక మీడియా సంస్థలు ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై పోల్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని పోల్స్ లో అభిజీత్ విన్నర్ అంటూ ఫలితాలు వస్తున్నాయి. దాదాపు 50శాతానికి పైగా ఓట్లు అభిజీత్ పొందుతున్నారు అనేది అనేక సర్వేల సమాచారం. అయితే అనూహ్యంగా ఓటింగ్లో లేడీ కంటెస్టెంట్ అరియనా ముందుకు వచ్చారనే మరో వాదన మొదలైంది. అరియనా ఓటింగ్ లో అభిజీత్ ని వెనక్కినెట్టి మొదటి స్థానం […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 11:35 AM IST
    Follow us on


    బిగ్ బాస్ షోకి ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి రీత్యా అనేక మీడియా సంస్థలు ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై పోల్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని పోల్స్ లో అభిజీత్ విన్నర్ అంటూ ఫలితాలు వస్తున్నాయి. దాదాపు 50శాతానికి పైగా ఓట్లు అభిజీత్ పొందుతున్నారు అనేది అనేక సర్వేల సమాచారం. అయితే అనూహ్యంగా ఓటింగ్లో లేడీ కంటెస్టెంట్ అరియనా ముందుకు వచ్చారనే మరో వాదన మొదలైంది. అరియనా ఓటింగ్ లో అభిజీత్ ని వెనక్కినెట్టి మొదటి స్థానం ఆక్రమించగా…అభిజీత్ రెండో స్థానానికి పడిపోయారట.

    Also Read: నిహారిక గురించి సాయిధరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు !

    మొదటి నుండి జెన్యూన్ ప్లేయర్ అనే ట్యాగ్ సంపాదించుకున్న అరియానా పట్ల, ప్రేక్షకులలో సదాభిప్రాయం ఏర్పడడం జరిగిందన్న వాదన వినిపిస్తుంది. అలాగే గత మూడు సీజన్స్ లో కేవలం అబ్బాయిలు మాత్రమే విన్నర్స్ గా నిలిచారు. ఈ సీజన్ లో అయినా ఒక లేడీ బిగ్ బాస్ ట్రోపీ గెలిస్తే చూడాలనేది కూడా దీనికి ఒక కారణం అంటున్నారు. ఐతే ఈ అనధికారిక ఓటింగ్ ని నమ్మలేం అని కొందరు భావిస్తున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అనేది చివరి వరకు సస్పెన్సు అని చెప్పాలి.

    Also Read: భారీగా దిల్ రాజు 50వ జన్మదిన వేడుకలు !

    ఇక బిగ్ బాస్ చివరి ఎపిసోడ్స్ కూడా ఏమంత రంజుగా సాగడం లేదు. నిన్న ఎపిసోడ్ మొత్తం అఖిల్, అభిజిత్ ఏవిలను చూపించడంతోనే సరిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ మరియు అభిజీత్ జర్నీని వీడియో రూపంలో బిగ్ బాస్ చూపించారు. అఖిల్ ని మనసును, బుద్ధిని బ్యాలన్స్ చేసి మంచి నిర్ణయాలు తీసుకొని గొప్పగా అడావు అని బిగ్ బాస్ పొగిడాడు. అలాగే మోనాల్ తో అతని ప్రేమ వ్యవహారాన్ని కూడా బిగ్ బాస్ పరోక్షంగా ప్రస్తావించారు. మరో కంటెస్టెంట్ అభిజిత్ ని బిగ్ బాస్…. హౌస్ లో ఉన్న మెచ్యూర్డ్ మాన్ , మిస్టర్ కూల్ అంటూ పొగిడారు. భావోద్వేగాలు అణచుకొని కష్టపడి ఆడావు… ఈ క్రమంలో కొందరు నిన్ను అపార్ధం చేసుకున్నారు అన్నాడు. అఖిల్, అభిజీత్ ఏవిలలో మోనాల్ తో రొమాన్స్ కామన్ గా కనిపించింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్