‘అయ్యప్పన్ కోశియమ్’ రీమేక్ టైటిల్ ఖరారు

పవన్ కల్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. వీరి సినిమాకు ‘బిల్లా రంగా’ గా పేరు నమోదు చేసుకున్నారు. మళయాళం మూవీ ‘అయ్యప్పన్ కోశియమ్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’గా పేరు పెట్టారు. ఈ పేరు సినిమాకు తగ్గట్టుగా ఉంటుందని యూనిట్ […]

Written By: Suresh, Updated On : December 22, 2020 10:21 am
Follow us on

పవన్ కల్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. వీరి సినిమాకు ‘బిల్లా రంగా’ గా పేరు నమోదు చేసుకున్నారు. మళయాళం మూవీ ‘అయ్యప్పన్ కోశియమ్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’గా పేరు పెట్టారు. ఈ పేరు సినిమాకు తగ్గట్టుగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. అయితే 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఇదే టైటిల్ తో సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలు నటిస్తున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.