https://oktelugu.com/

కరోనా కొత్త స్ట్రెయిన్ కు ధీటుగా కొత్త స్లోగన్..!

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఈ రెండు పదాలు వింటేనే ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ మానవళికి పెద్ద సవాల్ విసురుతోంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని ఆనందించేలోపే కొత్త వైరస్ ప్రపంచాన్ని అతలాకులతం చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని అప్రమత్తమవుతున్నాయి. యూరప్ దేశాలు ఇప్పటికే క్రిస్మస్.. న్యూ ఇయర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 12:25 PM IST
    Follow us on

    కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఈ రెండు పదాలు వింటేనే ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ మానవళికి పెద్ద సవాల్ విసురుతోంది.

    కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని ఆనందించేలోపే కొత్త వైరస్ ప్రపంచాన్ని అతలాకులతం చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

    దీంతో అన్ని అప్రమత్తమవుతున్నాయి. యూరప్ దేశాలు ఇప్పటికే క్రిస్మస్.. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసుకున్నాయి. కొత్త కేసులు వెలుగు చూస్తున్న దేశాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తుండటంతో మళ్లీ ఆందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి.

    భారత్ లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఎయిర్ పోర్టుల్లోనే విదేశీయులకు కరోనా టెస్టులు నిర్వహిస్తూ అనుమానితులను హోం క్వారంటైన్ కు తరలిస్తోంది.

    కరోనా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ‘గో కరోనా గో’ అంటూ కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే పిలుపునిచ్చారు. ఈ స్లోగన్ చాలా పాపులార్ అయింది.

    తాజాగా కరోనా కొత్త స్ట్రయిన్ తరిమేందుకు ‘నో కరోనా.. నోనో కరోనా’అంటూ అథవాలే కొత్త స్లోగన్ ఇచ్చారు. తాను గో కరోనా అంటే.. అది తనకే వద్దకే వచ్చిందన్నారు. తాను కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు రామ్ దాస్ అథవాల్ చెప్పారు.

    కరోనా వైరస్ తన వద్దకే కాదు.. ఎక్కడికైనా వెళుతుందని అథవాలే తెలిపారు. పాత వైరస్ కు తోడుగా కొత్త వైరస్ వస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    అందుకే తాను ‘నో కరోనా.. నోనో కరోనా.. అనే స్లోగన్ ఇస్తున్నానని.. మనకు పాత కరోనా వైరస్ వద్దూ.. కొత్త వైరస్ వద్దనే అభిప్రాయాన్ని అథవాలే కొత్త స్లోగన్ రూపంలో వ్యక్తం చేశారు.