https://oktelugu.com/

బిగ్ బాస్ హౌస్ లో.. మసాలా లవ్ డ్రామాలు!

బిగ్ బాస్.. ఎమోషన్స్ అండ్ వీక్ నెస్ లనే ఒక గేమ్ లా మార్చిన పక్కా కమర్షియల్ రియాల్టీ షో. ఇలాంటి షోలు తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వవు అనే దృఢ నమ్మకం ఉండేది ఒకప్పుడు. అందుకే ఇలాంటి షోలు హిందీలో ఎప్పుడో వచ్చినా తెలుగులో రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఆ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుంది. సీజన్ వన్ కి హోస్ట్ గా చేసి.. షోని తెలుగు వాకిట్లోకి తీసుకువెళ్ళాడు. ఇక ఎప్పుడెప్పుడా […]

Written By:
  • admin
  • , Updated On : August 6, 2020 / 10:39 AM IST
    Follow us on


    బిగ్ బాస్.. ఎమోషన్స్ అండ్ వీక్ నెస్ లనే ఒక గేమ్ లా మార్చిన పక్కా కమర్షియల్ రియాల్టీ షో. ఇలాంటి షోలు తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వవు అనే దృఢ నమ్మకం ఉండేది ఒకప్పుడు. అందుకే ఇలాంటి షోలు హిందీలో ఎప్పుడో వచ్చినా తెలుగులో రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఆ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుంది. సీజన్ వన్ కి హోస్ట్ గా చేసి.. షోని తెలుగు వాకిట్లోకి తీసుకువెళ్ళాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజ‌న్‌-4 త్వరలో మొదలవుతుంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. బిగ్ బాస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఈ సారి గత సీజన్ ల కంటే కూడా ఫుల్ మసాలాను యాడ్ చేయబోతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకూ హౌస్ లో అమ్మాయిలే ఎక్కువగా ఉండేలా.. వారితో ఉండే అబ్బాయిలతో కాస్త కిక్ ఇచ్చే లవ్ డ్రామాలు యాడ్ చేసేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ లో ఉన్నారు.

    Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్

    ఇక ఈ సారి షో షెడ్యూల్ ను కుదించారని.. రెగ్యులర్ గా ఉండే వంద రోజులను అరవై రోజులకు కుదించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. గ‌త మూడు సీజ‌న్ ల్లో వంద రోజుల‌కు త‌గ్గ‌కుండా షోలు ఎలా నడిచాయో.. ఈ ద‌ఫా కూడా వంద రోజుల‌కు తగ్గకుండా బిగ్‌బాస్ రియాల్టీ షో కొన‌సాగనుంది. ప్రస్తుతం ఉన్న ఎంటర్ టైన్మెంట్ కొరతను కవర్ చేసేలా.. అవసరం అయితే షోను మరో పది రోజులు పొడిగించే ఉద్దేశ్యం కూడా ఉందట. ఇక నాలుగో సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా హీరో నాగార్జున వ్యవ‌రించ‌బోతున్నాడు. అయితే కరోనా కారణాన్ని చూపి మొదట నాగ్ హోస్ట్ గా చేయను అన్నాడు. ఆ తరువాత బిగ్ బాస్ టీం నాగ్ ను ఎలాగోలా ఒప్పించిందనుకోండి.

    Also Read: నితిన్‌కు విలన్‌గా నయనతార.. సాధ్యమేనా?

    కాగా నాగార్జున‌ కోసం బిగ్‌బాస్ టీం ప్ర‌త్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా నాగ్ కోసం ప్రత్యేక రూమ్స్ ను అండ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. పైగా నాగ్ హౌస్ లోకి రాకుండానే డిజిటల్ లో కనిపిస్తూ హౌస్ ను మధ్యమధ్యలో నడిపించే విధంగా ప్లాన్ చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారిని దృష్టిలో పెట్టుకుని నాగ్ కోసం బిగ్ బాస్ టీం మొత్తానికి తమ కండీష‌న్స్ ను పక్కన పెట్టిన‌ట్టు కనిపిస్తుంది. అన్నిటికి మించి నాగ్ ప్రతి వారం నేరుగా కంటెస్టెంట్స్‌తో ఇంట‌రాక్ష‌న్ చేయాల్సిన అవసరం లేకుండా గేమ్ ని డిజైన్ చేసారట.