https://oktelugu.com/

చట్టసభల్లో ఆధిపత్యం కోసం బైడెన్ ఫోకస్

అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ వచ్చి రావడంతో పాలనను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. చట్టసభల్లో ఆదిపత్యంపై ఫోకస్ పెట్టారు. అక్కడ ఆధిపత్యం ఉంటే తమ బిల్లులు, చట్టాలను వేగంగా ఆమోదించుకోవచ్చని స్కెచ్ గీశారు. తాజాగాసెనెట్ లో కొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రటిక్ పార్టీ సెనెటర్లను కూడా ప్రమాణం చేయించారు. Also Read: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి గ్రామానికి ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్..? ఇందులో జార్జియా నుంచి ఎన్నికైన పాత్రికేయుడు ఒస్సోఫ్, అట్లాంటాకు చెందిన పాస్టర్ వార్నాక్, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2021 / 08:32 AM IST
    Follow us on

    అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ వచ్చి రావడంతో పాలనను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. చట్టసభల్లో ఆదిపత్యంపై ఫోకస్ పెట్టారు. అక్కడ ఆధిపత్యం ఉంటే తమ బిల్లులు, చట్టాలను వేగంగా ఆమోదించుకోవచ్చని స్కెచ్ గీశారు. తాజాగాసెనెట్ లో కొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రటిక్ పార్టీ సెనెటర్లను కూడా ప్రమాణం చేయించారు.

    Also Read: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి గ్రామానికి ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్..?

    ఇందులో జార్జియా నుంచి ఎన్నికైన పాత్రికేయుడు ఒస్సోఫ్, అట్లాంటాకు చెందిన పాస్టర్ వార్నాక్, కాలిఫోర్నియా నుంచి గెలుపొందిన అలెక్స్ పడిల్లాలతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణం చేయించారు.

    ఈ పరిణామంతో ఇప్పటివరకు రిపబ్లికన్లు ఆధిక్యత చాటుతూ వచ్చిన సెనెట్ లో ఇప్పుడు డెమొక్రాట్లు పైచేయి సాధించినట్టు అయ్యింది.

    Also Read: భాగ్యనగర వాసులకు శుభవార్త… 57 ఉచిత వైద్య పరీక్షలు..?

    కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ఆయన యంత్రాంగానికి సంబంధించిన కొంత మంది నియామకాలకు సెనెట్ ఆమోదం తెలుపడం ఆనవాయితీగా అమెరికాలో వస్తోంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కొత్త సభ్యుల ప్రమాణం అనంతరం సభ సమావేశమైంది.

    అధ్యక్షుడి బధ్రతా బాధ్యతలు చేపట్టే ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డైరెక్టర్ గా బైడెన్ తన కేబినెట్ కు నామినేట్ చేసిన అర్విల్ హైనెస్ నియామకానికి 84-10 తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది. దీంతో ముగ్గురు సెనెటర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో అమెరికా చట్టసభల్లో డెమొక్రాట్ల బలం పెరిగినట్టైంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు