https://oktelugu.com/

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం భేటి.. కీలక అంశాలివే..!

తెలంగాణలో ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. నిరుద్యోగులకు కొత్త సంవత్సరంలో కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్న సంగతి తెల్సిందే..! దీనిలో భాగంగా ఆయా వర్గాలను ఆకట్టుకునేలా వరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగుల కోసం 50వేల ఉద్యోగాల ప్రకటన.. ఉద్యోగుల వేతనాల పెంపు.. ప్రమోషన్లు.. పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఈక్రమంలోనే తాజాగా ఉద్యోగ సంఘాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 31, 2020 / 04:58 PM IST
    Follow us on


    తెలంగాణలో ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. నిరుద్యోగులకు కొత్త సంవత్సరంలో కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్న సంగతి తెల్సిందే..!

    దీనిలో భాగంగా ఆయా వర్గాలను ఆకట్టుకునేలా వరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగుల కోసం 50వేల ఉద్యోగాల ప్రకటన.. ఉద్యోగుల వేతనాల పెంపు.. ప్రమోషన్లు.. పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు.

    ఈక్రమంలోనే తాజాగా ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ గురువారం భేటి అయ్యారు. ఈ భేటి అనంతరం సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే అలాంటి ప్రకటన ఏమీ రాకపోవడం కొంత నిరుత్సానికి గురిచేసింది.

    ఉద్యోగ సంఘాల భేటిలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పీఆర్సీ కమిషన్ నివేదిక తుది నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక జనవరి చివరిలోగా ఉద్యోగుల ప్రమోషన్స్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

    అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయస్సుపై జనవరిలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

    ఇక జనవరి మొదటి వారంలో ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్ భేటి అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి వారంలో పీఆర్సీ కమిషన్ రిపోర్టు ను సీఎస్ కమిటీ రివ్యూ చేయనుంది.

    అలాగే రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి సమావేశం నిర్వహించనుంది. ఇక మూడో వారంలో పీఆర్సీ ప్రకటన చేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

    అయితే అందరూ ఊహించినట్లుగా నేడు పీఆర్సీపై ప్రకటన రాకపోవడం ఉద్యోగులు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. పీఆర్సీ.. మిగతా అంశాలపై క్లారిటీ రావాలంటే జనవరి చివరి వారం వరకు వేచిచూడాల్సిన పరిస్థితులు అయితే కన్పిస్తున్నాయి.