https://oktelugu.com/

సీఎం జగన్ వ్యూహం.. కాళ్లబేరానికి నిమ్మగడ్డ?

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికార పక్షం.. ప్రతిపక్షల మధ్య రాజకీయ యుద్ధం నడవాల్సింది పోయి.. అంతకుమించిన వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విపక్షం కన్నా.. ఎక్కువగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నింటిని వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం ట్రస్టుభవన్ సూచన మేరకు అధికారాన్ని చెలాయిస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి నేటి వరకు వైసీపీకి వ్యతిరేకంగానే నిమ్మగడ్డ పావులు కదుపుతున్నాడు. వైసీపీ తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాన్ని […]

Written By: , Updated On : January 31, 2021 / 06:04 PM IST
Follow us on

AP Govt vs Nimmagadda Ramesh Kumar

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికార పక్షం.. ప్రతిపక్షల మధ్య రాజకీయ యుద్ధం నడవాల్సింది పోయి.. అంతకుమించిన వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విపక్షం కన్నా.. ఎక్కువగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నింటిని వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం ట్రస్టుభవన్ సూచన మేరకు అధికారాన్ని చెలాయిస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి నేటి వరకు వైసీపీకి వ్యతిరేకంగానే నిమ్మగడ్డ పావులు కదుపుతున్నాడు. వైసీపీ తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాన్ని తప్పబడుతూ.. అడ్డుకుంటున్నారు. ఎన్నో ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏకగ్రీవ పంచాయతీల తీర్మాణాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే అవేమీ పట్టని ప్రజలు ప్రభుత్వం నజరానాలకు ఆకర్షితులు అవుతూ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు పెద్ద పీట వేస్తున్నారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేసిన నాటినుంచి తన సొంత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని చూస్తున్నారు. తనకు నచ్చని అధికారులను బదిలీ చేస్తూ.. ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారు. పైగా ఎన్నికలల్లో భాగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గవర్నర్ కు వివరణ ఇస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించిన వైసీపీ నేతలను సైతం టార్గెట్ చేస్తూ.. వచ్చిన నిమ్మగడ్డకు ప్రభుత్వ పెద్దలు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి, ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పనిచేస్తున్నారని శాసనసభ వ్యవహారాల ఉల్లంఘన కింద స్పీకరుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాలనకు రమేశ్ కుమార్ అడ్డు పడుతున్నారని వివరించారు.

ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. టీడీపీ నుంచి ఈ విషయమై వివరణ కోరారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రచురణకర్తగా పేర్కొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి.. మద్దిపాటి వెంకటరాజును ఫిబ్రవరి 2లోపు వివరణ ఇవ్వాలని లేఖ రాశారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు ఈనెల 28 చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేయడం.. చట్ట విరుద్ధమని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పార్టీ రహితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు.. కరపత్రాలు.. ఫ్లెక్సీలు.. రాజకీయ పార్టీలు వాడొద్దని చట్టం స్పష్టం చేస్తుందని వారు తెలిపారు. మేనిఫెస్టో ప్రతులను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని కోరు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు.. ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ‘పల్లె ప్రగతి.. పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోపై వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక అభిప్రాయానికి వచ్చేందుకే వివరణ కోరినట్లు ఎస్ఈసీ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. దీన్ని నిమ్మగడ్డ చేతులతోనే టీడీపీని వైసీపీ కొట్టిందని అర్థం చేసుకోవచ్చు. జగన్ వ్యూహానికి దెబ్బకు నిమ్మగడ్డ కాళ్లబేరానికి వచ్చాడని వైసీపీ  నేతలు అంటున్నారు.