నెలకు రూ.6 వేలు చెల్లిస్తే కొత్త కారు.. ఎలా అంటే..?

కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి రెనాల్ట్ కంపెనీ శుభవార్త చెప్పింది. లోన్ తీసుకొని తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. నెలకు 6,500 రూపాయల ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు ఆన్‌రోడ్ ధర 3.6 లక్షల రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో ఈ ధర ఉండగా ప్రాంతాన్ని బట్టి కారు ధరలలో మార్పు ఉండే అవకాశం ఉంది. […]

Written By: Kusuma Aggunna, Updated On : January 31, 2021 6:07 pm
Follow us on

కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి రెనాల్ట్ కంపెనీ శుభవార్త చెప్పింది. లోన్ తీసుకొని తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. నెలకు 6,500 రూపాయల ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు ఆన్‌రోడ్ ధర 3.6 లక్షల రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో ఈ ధర ఉండగా ప్రాంతాన్ని బట్టి కారు ధరలలో మార్పు ఉండే అవకాశం ఉంది.

అయితే ఈ కారును కొనుగోలు చేయడానికి డౌన్ పేమెంట్ ను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. 50,000 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే నెలకు 6,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలపరిమితితో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. అందుబాటు ధరలలో కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ కారు బెస్ట్ అని చెప్పవచ్చు. కొత్త కారును తక్కువ బడ్జెట్ లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కారు మంచి ఆప్షన్ అవుతుంది.

అయితే ఎక్కువ డౌన్ పేమెంట్ ను చెల్లించడం ద్వారా అంటే మొత్తం ఈఎంఐతో లోన్ టెన్యూర్ ను తగ్గించుకోవచ్చు. సమీపంలో రెనాల్ట్ షోరూమ్ ను సంప్రదించి లేదా ఆన్ లైన్ ద్వారా ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నెలకు 6,500 రూపాయలు చెల్లించే సామర్థ్యం ఉన్నవాళ్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం వల్ల వడ్డీ భారాన్ని సులభంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

ఈ కారును కొనుగోలు చేసిన వారికి వడ్డీ రేటు 9.5 శాతం ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ ధరలో కార్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇతర కంపెనీలు సైతం కొన్ని మోడళ్లను ఇదే ధరకు అందుబాటులోకి తెచ్చాయి.