https://oktelugu.com/

ప్రభాస్ పెళ్లి.. బడా బిజినెస్‌మెన్ కూతురితో.. !

గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ జనం నోళ్ళలో నిత్యం నానుతూ వస్తోన్న ప్రభాస్ పెళ్లి వ్యవహారం పై మళ్ళీ మరో కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. ఓ బడా బిజినెస్‌ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అంటూ తాజా పుకారు. ఇప్పటికే ప్రభాస్ వయసు నాలుగు పదుల్లో ఉంది కాబట్టి.. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకపోతే, ఇక భవిష్యత్తులో ఓల్డ్ ఏజ్ పెళ్లి అవుతుందనే భయం ఉండటంతో ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ప్రభాస్ కి పెళ్లిని […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 05:23 PM IST
    Follow us on


    గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ జనం నోళ్ళలో నిత్యం నానుతూ వస్తోన్న ప్రభాస్ పెళ్లి వ్యవహారం పై మళ్ళీ మరో కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. ఓ బడా బిజినెస్‌ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అంటూ తాజా పుకారు. ఇప్పటికే ప్రభాస్ వయసు నాలుగు పదుల్లో ఉంది కాబట్టి.. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకపోతే, ఇక భవిష్యత్తులో ఓల్డ్ ఏజ్ పెళ్లి అవుతుందనే భయం ఉండటంతో ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ప్రభాస్ కి పెళ్లిని ఖాయం చేశారట. కృష్ణంరాజు సతీమణి సన్నిహితులైన ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

    Also Read: హౌస్ ఫుల్…100 శాతం ఆక్యుపెన్సీకి తెలంగాణ ప్రభుత్వం ఓకే

    కాగా ఆ అమ్మాయి బడా బిజినెస్‌మెన్ కూతురు అని కూడా తెలుస్తోంది. అమ్మాయి ఫ్యామిలీ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా అని, ఆమె తండ్రికి అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు ఇతర బిజినెస్‌ లు కూడా ఉన్నాయని, రానున్న రోజుల్లో సినీ నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి జరగనుందని అన్నారు.. ఆ తరువాత బాహుబలి తరువాత అన్నారు, ఇప్పుడు సలార్ తరువాత అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో చూడాలి. అయితే ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఏ బాలీవుడ్ బడా స్టార్ కి చేతగాని ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ఏకైక తెలుగు హీరో.

    Also Read: సినిమా ట్రైలర్ టాక్: ‘పిట్టకథలు’ !

    మరి అంతలా ఎదిగిపోయాడు ప్రభాస్. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎప్పటినుండో వెలితిగా మిగిలిపోయిన అంశం.. ప్రభాస్ పెళ్లి. సినిమాల పరంగా మిగిలిన హీరోలు కంటే.. టాప్ లో ఉన్న ప్రభాస్.. పెళ్లి విషయంలో మాత్రం వెనుకపడిపోయాడు. ప్రభాస్ కంటే పదేళ్లు వయసు తక్కువ ఉన్న హీరోలు కూడా పెళ్లి పిల్లలతో హ్యాపీగా సెటిల్ అయిపోతే.. ప్రభాస్ మాత్రం ఇంకా సోలో లైఫ్ సో బెటర్ అనే విధంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. అయితే స్వీటీ అనుష్కతో ప్రభాస్ చాలా సంవత్సరాలుగా లవ్ లో ఉన్నాడని.. అందుకే వాళ్ళు పెళ్లికి దూరంగా ఉంటున్నారని.. ఆ కారణంగానే అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా మళ్లీ ప్రభాస్ ప్రేమ కోసం ఎదురుచూస్తుందని ఇలా అనేక రూమర్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్