ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యార్థినులకు మరో బంపర్ గిఫ్ట్ లు ప్రకటించారు. రెండు కొత్త పథకాలను మార్చి 8న మహిళా దినోత్సవరం రోజున జగన్ ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమంపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే రెండు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 7-12వ తరగతి విద్యార్థులనులకు ఈ శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థునులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్ కిన్స్ ను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు శానిటరీ నేప్ కిన్స్ పంపిణీ చేయనున్నారు. జూలై 1 నుంచి ప్రతినెల ఉచితంగా ఈ నేప్ కిన్స్ పంపిణీ మొదలవుతుంది. నెలకి 10 చొప్పున ఏడాదికి 120 నేప్ కిన్స్ ప్రతి విద్యార్థినికి పంపిణీ చేయనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం ప్రభుత్వం రూ.41.4 కోట్లను కేటాయించింది. ఇక రాష్ట్రంలోని పేద మహిళలకు చేయూత కిరాణా స్టోర్స్ లో తక్కువ ధరకే శానిటరీ నేప్ కిన్స్ పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. చేయూత స్టోర్స్ల్ లో అందుబాటు ధరల్లో బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్ కిన్స్ పంపిణీ చేయాలని తలపెట్టారు.