బాలయ్యతో దిల్ రాజు మూవీ.. డెరెక్టర్ అతనేనట..?!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు దిల్ రాజు హ‌వా మామూలుగా లేదు. సినీ జ‌నాలు ఊహించ‌ని ప్రాజెక్టుల‌ను.. ఆడియ‌న్స్ క‌ల‌లో కూడా ఫిక్స్ చేయ‌ని కాంబినేష‌న్ల‌ను మిక్స్ చేస్తున్నాడీ నిర్మాత‌. సినిమా అనేది వ్యాపార‌మే అయిన‌ప్ప‌టికీ.. అభిమానుల‌కు అదో ఎమోష‌న్‌. అలాంటి ఎమోష‌న్స్ ను మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంటాడు దిల్ రాజు. Also Read: రాజమౌళి మెచ్చిన టీజర్.. చూస్తే షేకింగ్ వెంకీ-మహేష్ కాంబోను వెండి తెర‌పై చూపించి వారెవ్వా అనిపించాడు దిల్ […]

Written By: Bhaskar, Updated On : March 6, 2021 10:02 am
Follow us on


తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు దిల్ రాజు హ‌వా మామూలుగా లేదు. సినీ జ‌నాలు ఊహించ‌ని ప్రాజెక్టుల‌ను.. ఆడియ‌న్స్ క‌ల‌లో కూడా ఫిక్స్ చేయ‌ని కాంబినేష‌న్ల‌ను మిక్స్ చేస్తున్నాడీ నిర్మాత‌. సినిమా అనేది వ్యాపార‌మే అయిన‌ప్ప‌టికీ.. అభిమానుల‌కు అదో ఎమోష‌న్‌. అలాంటి ఎమోష‌న్స్ ను మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంటాడు దిల్ రాజు.

Also Read: రాజమౌళి మెచ్చిన టీజర్.. చూస్తే షేకింగ్

వెంకీ-మహేష్ కాంబోను వెండి తెర‌పై చూపించి వారెవ్వా అనిపించాడు దిల్ రాజు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్-భార‌తీయ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో సినిమా ఫిక్స్ చేసి వార్నాయ‌నో అనిపించాడు. ఇక‌, త‌ను ఎంతో కాలంగా వెయిట్ చేసిన ప‌వ‌న్ తోనూ సినిమా తీసి, కోరిక నెర‌వేర్చుకున్నాడు. ఈ విధంగా.. దిల్ రాజు సూప‌ర్ కాంబినేష‌న్స్ సెట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.

అయితే.. నంద‌మూరి హీరోల్లో ఇప్ప‌టికే ఎన్టీఆర్ తో సినిమా తీశాడు దిల్ రాజు. కానీ.. బాల‌య్యతో సినిమా అన్న‌దే చ‌ర్చ‌లోకి రాలేదెన్న‌డూ. అయితే.. హ‌ఠాత్తుగా ఇప్పుడు బాల‌కృష్ణ‌తో సినిమా తీయ‌బోతున్నాడ‌నే విష‌యం చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ బోయ‌పాటితో బీబీ-3 చేస్తున్న విష‌యం తెలిసిందే. మే 28న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

Also Read: ట్రైలర్ టాక్: భర్త చనిపోయిన మహిళతో ‘చావు’ ప్రేమ

ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య‌-దిల్ రాజు కాంబోలో సినిమా అనౌన్స్ అయినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. కార‌ణం ఏమంటే.. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి బాల‌య్య‌కు ఓ క‌థ వినిపించాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ ను కూడా అనుకున్న‌ట్టు స‌మాచారం.

దీనికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. నిర్మాణ బాధ్య‌త‌ల‌ను దిల్ రాజు తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ కాంబో గ‌న‌క సెట్ అయితే.. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ట నిర్మాత‌. మ‌రి ఏం జ‌రుగుతుంది? ఇది వాస్త‌వ రూపం దాలుస్తుందా? లేక, రూమర్ గానే మిగిలిపోతుందా? అన్న‌ది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్