https://oktelugu.com/

చంద్రబాబు చేయని పని.. జగన్ కు పోల‘వర’మవుతుందా?

ఐదేళ్లు అధికారంలో ఉంటే ఏం చేయొచ్చు.. అద్భుతాలు సాధించవచ్చు. వ్యవస్థను మార్చవచ్చు. కొత్త చట్టాలు చేయొచ్చు. మూడేళ్లలోనే ‘కాళేశ్వరం’ లాంటి అద్భుతమైన పథకాలను కట్టవచ్చు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న నాటి సీఎం చంద్రబాబు అమరావతి పేరిట ప్రజలకు గ్రాఫిక్స్ మాయాజాలం చూపించారు. పోలవరం పూర్తయ్యిందంటూ ‘చంద్రన్న భజన’ పాటలు మీడియాలో ప్రచారం చేయించారు. కానీ ఆయన దిగిపోయాకే వాటి ఫలితాలు అర్థమయ్యాయి. ఆయన ఫెయిల్యూర్ కనిపించింది. Also Read: ఏపీ కేబినెట్లోకి ఈసారి వారికే ఛాన్స్..? […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2020 / 09:59 AM IST
    Follow us on

    ఐదేళ్లు అధికారంలో ఉంటే ఏం చేయొచ్చు.. అద్భుతాలు సాధించవచ్చు. వ్యవస్థను మార్చవచ్చు. కొత్త చట్టాలు చేయొచ్చు. మూడేళ్లలోనే ‘కాళేశ్వరం’ లాంటి అద్భుతమైన పథకాలను కట్టవచ్చు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న నాటి సీఎం చంద్రబాబు అమరావతి పేరిట ప్రజలకు గ్రాఫిక్స్ మాయాజాలం చూపించారు. పోలవరం పూర్తయ్యిందంటూ ‘చంద్రన్న భజన’ పాటలు మీడియాలో ప్రచారం చేయించారు. కానీ ఆయన దిగిపోయాకే వాటి ఫలితాలు అర్థమయ్యాయి. ఆయన ఫెయిల్యూర్ కనిపించింది.

    Also Read: ఏపీ కేబినెట్లోకి ఈసారి వారికే ఛాన్స్..?

    ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన తప్పును తాను చేయకుండా ఏపీ ప్రస్తుత సీఎం జగన్ ముందుకెళుతున్నారు. పథకాలతో పైసలు కరువైనా.. కేంద్రం నిధులు విదిల్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నా ఏపీ కలల ప్రాజెక్టు పోలవరంను ఆపడం లేదు. ఉన్నంతలో పరుగులు పెట్టిస్తున్నారు.

    పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ప్రాజెక్ట్ పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు వస్తున్నారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా ఫోకస్ పెంచింది.

    Also Read: జగన్ పై కేంద్రానికి కేసీఆర్ ఫిర్యాదు: సానుకూలం తెలిపిన జలశక్తి మంత్రి..!

    ఏపీ ప్రజల సాగు, తాగునీటికి పుష్కలంగా నీరు లభించే పోలవరం జీవనాధారం. అందుకే ఈ ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేసి రాబోయే ఎన్నికల్లోనే దీన్నే ఆయుధంగా వాడి గెలవాలని సీఎం జగన్ ధృడ స్పంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 14న సీఎం జగన్ స్వయంగా పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. అక్కడి గెస్ట్ హౌస్ లోనే పోలవరం పనుల పురోగతిపై జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

    సీఎం జగన్ టూర్ ఖరారైంది. 14వ తేదిన ఉదయం 10.30 గంటలకు పోలవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. పోలవరం జరుగుతున్న పనులను చూసేందుకు కేంద్రమంత్రి షెకావత్ సైతం రాబోతుండడంతో ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్ట్ పూర్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్