https://oktelugu.com/

మహేష్ కోసం అనిల్ కపూర్ ను ఒప్పించిన నమ్రతా !

సూపర్ స్టార్ గా మహేశ్ ఎదగడానికి ముఖ్యకారణం.. మహేష్ జడ్జ్ మెంటే.. ఈ జనరేషన్ లో కథల పై ఏ హీరోకి లేని క్లారిటీ మహేష్ కి ఉంది. అందుకే, మహేష్ ప్లాప్ సినిమాల్లో కూడా మంచి కథలు ఉంటాయి. మరి, అలాంటి మహేష్ కి బాగా నచ్చిన కథ.. పరుశురామ్ చెప్పిన ‘సర్కారు వారి పాట’ కథ. ఈ కథ మహేష్ కి బాగా కనెక్ట్ అయిందట. అందుకే మహేష్ ఈ సినిమా కోసం మొత్తం […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 10:01 AM IST
    Follow us on


    సూపర్ స్టార్ గా మహేశ్ ఎదగడానికి ముఖ్యకారణం.. మహేష్ జడ్జ్ మెంటే.. ఈ జనరేషన్ లో కథల పై ఏ హీరోకి లేని క్లారిటీ మహేష్ కి ఉంది. అందుకే, మహేష్ ప్లాప్ సినిమాల్లో కూడా మంచి కథలు ఉంటాయి. మరి, అలాంటి మహేష్ కి బాగా నచ్చిన కథ.. పరుశురామ్ చెప్పిన ‘సర్కారు వారి పాట’ కథ. ఈ కథ మహేష్ కి బాగా కనెక్ట్ అయిందట. అందుకే మహేష్ ఈ సినిమా కోసం మొత్తం లుక్ ను మార్చుకుని తెగ కష్టపడుతున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విలన్ గా మొదట కన్నడ హీరో ఉపేంద్రను అనుకున్నారు. కానీ, ఉపేంద్ర ఎలాగూ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించాడు కాబట్టి.. మహేష్ సినిమాలో కూడా విలన్ గా నటించడానికి ఒప్పుకుంటాడని అనుకున్నారు.

    Also Read: అంచెలంచెలుగా ఎదిగిన ‘తలైవా’..: నేడు రజనీ పుట్టిన రోజు..

    కానీ ఉపేంద్ర మహేష్ కి నో చెప్పి షాక్ ఇచ్చాడు. తానూ స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పుడు విలన్ గా ఎందుకు చేస్తాను.. నన్ను విలన్ గా ఎలా అడుగుతున్నారు ? అంటూ ఉపేంద్ర మొత్తానికి ఎదురు ప్రశ్నించాడు. నిజానికి విలన్ పాత్ర అయినప్పటికీ, ఆ పాత్ర ఈ సినిమాలోనే అత్యంత కీలకమైన పాత్ర అట. హీరో పాత్ర కంటే.. విలన్ పాత్రే మెయిన్ హైలైట్ గా ఉంటుందని… అందుకే కచ్చితంగా స్టార్ డమ్ ఉన్న ఆర్టిస్ట్ అయితేనే.. ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని మహేష్ ఫీల్ అవుతున్నాడట. మరి విలన్ గా చేయడానికి ఎవరు అంగీకరిస్తారు అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ మాజీ హీరో అనిల్ కపూర్ ఆ పాత్రకు బాగుంటాడని మహేష్ ఫీల్ అయినట్టు తెలుస్తోంది.

    Also Read: నో ఎట్టి పరిస్థితుల్లో ముద్దు పెట్టాల్సిందే !

    దర్శకుడు పరుశురామ్, అనిల్ కపూర్ కి కథ చెప్పడానికి టైం అడిగితేనే.. నేను తెలుగు సినిమా చేయలేను అంటూ అనిల్ కపూర్ కథ కూడా వినలేదు అట. దాంతో మహేష్ సతీమణి నమ్రతా రంగంలోకి దిగారు. గతంలో ఆమెకు అనిల్ కపూర్ కి బాగా పరిచయం ఉండటంతో, ఆమె ఆ పరిచయాన్ని వాడుకొని.. అనిల్ ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేష్ కి విలన్ గా అనిల్ కపూర్ ఫిక్స్ అవ్వబోతున్నాడు అన్నమాట. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమాని పరుశురామ్ తీసుకురాబోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్