
తమిళనాడు సీఎం పళనిసామి గొప్పమనస్సును చాటుకున్నారు. ఒక దివ్యాంగురాలు తనకు ఉపాధి కల్పించాలని వినతిపత్రం ఇచ్చిన గంటలోనే ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. సీఎం చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు సీఎంను ప్రశంసిస్తున్నారు. బుధవారం సీఎం పళనిస్వామి తూత్తుకుడిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కేన్సర్ చికిత్స యంత్రాన్ని ప్రారంభించటానికి వెళ్లారు.
Also Read..ఏపీలో 49 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణమేమిటంటే..?
యంత్రాన్ని ప్రారంభించిన అనంతరం కారులో కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లే సమయంలో ఒక దివ్యాంగురాలు చేతిలో వినతి పత్రం పట్టుకుని ఉండటం గమనించారు. సీఎం పళనిస్వామి వెంటనే డ్రైవర్ ను కారు ఆపమని చెప్పి దివ్యాంగురాలు ఇచ్చిన వినతిపత్రం తీసుకున్నారు. సీఎం దివ్యాంగురాలితో వీలైనంత త్వరగా తప్పకుండా సహాయం చేస్తామని మాట ఇచ్చారు. వినతిపత్రం తీసుకున్న గంటలోపే హామీని నిలబెట్టుకున్నారు.
ఆ తరువాత తాను కలెక్టర్ ఆఫీసుకు వెళుతున్నానని అక్కడికి వెళ్లి కలవాలని దివ్యాంగురాలికి సూచించారు. సీఎం చెప్పిన విధంగా మహిళ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ సీఎం ఆమెకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చారు. దీంతో అవాక్కవ్వడంమహిళ వంతయింది. తూత్తుకుడి ముత్తాయిపురం కు చెందిన మారీశ్వరి సీఎం ఉద్యోగం కల్పించడంతో తన ఆనందానికి అవధులు లేవని చెప్పుకొచ్చారు.
Also Read..తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. నిట్ లో ఉద్యోగాలు..?
సీఎం ఆమె విద్యార్హత ప్రకారం తూత్తుకుడిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వార్డు సూపర్ వైజర్ పోస్టును ఆమెకు ఇప్పించారు. మారీశ్వరి సీఎం పళనిస్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్పందించిన తీరును ఆ రాష్ట్ర ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు.