20వ శతాబ్దంలో సోషల్ మీడియా పాత్రను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీఒక్కరు సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతుంటారు. ఒకరి భావాలను మరొకరు పంచుకునేందుకునే, వినోదం, తదితర అంశాలకు సోషల్ మీడియాను విస్కృతంగా ఉపయోగిస్తుంటారు. ఇక సెలబెట్రీలైతే తమ అభిమానులతో తమ రోజువారీ విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పటికే అనేక మంది సెలబెట్రీలు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి తమ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాజాగా టాలీవుడ్ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇందుకు సంబంధించిన విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ఒక వీడియో బైట్ విడుదల చేసి ప్రకటించారు. ఇక తన భావాలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా సరైన వేదికగా భావిస్తున్నానని చెప్పారు. ఉగాది రోజున సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ వీడియో బైట్ లో ప్రకటించారు.
దీంతో మెగా ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆయనకు వెల్ కమ్ మెగాస్టార్ టు సోషల్ మీడియా అనే హ్యాష్ ట్యాగ్ లతో స్వాగతం పలుకుతున్నారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల్లో మెగాస్టార్ తొలి పోస్టు రేపటి నుంచి ఉండబోతుంది. దీంతో ఆయన ఎలాంటి ఎలాంటి పోస్టులు పెడుతారనే ఆసక్తి సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. చూడాలి మరీ మెగాస్టార్ తొలి పోస్టు ఏ రేంజ్లో ఉంటుందో. దీంతో ఉగాదికి ముందే మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.