
2019 సంవత్సరంలో చైనా దేశంలోని వుహాన్ లో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని నమ్ముతున్నాయి. కరోనా వ్యాక్సిన్ రేసులో ప్రపంచ దేశాల మధ్య పోటీ నెలకొంది. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను తయారు చేసే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అయితే చైనా తయారు చేసిన ఒక వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు ఇవ్వగా తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో మాత్రం వ్యాక్సిన్ ఫెయిల్ అయింది. కరోనావాక్ పేరుతో చైనా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు వికటించి కొందరు వాలంటీర్లు చనిపోయారు. చైనా వ్యాక్సిన్ ప్రయోగాలు బ్రెజిల్ లో జరుగుతుండగా అర్ధాంతరంగా వ్యాక్సిన్ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్ కంపెనీ నుంచి కీలక ప్రకటన వెలువడింది.
ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు కరోనా వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకోగా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్లు ఫెయిల్ అవుతున్నాయి. ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ ఆగి మళ్లి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే చైనాలో పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఆ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు ఏమవుతుందో అని చైనా ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. లక్షల మంది తీసుకున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో వికటించడంతో వ్యాక్సిన్ ను తయారు చేసిన సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.