Site icon OkTelugu

కరోనా నుంచి కోలుకున్న వారికి షాకింగ్ న్యూస్.. రోగుల్లో ఆ సమస్యలు..?

 

కరోనా మహమ్మారి గురించి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు విసృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో మూడు నెలల్లోనే మానసిక సమస్యలు కనిపిస్తున్నాయని తేల్చారు. కోలుకున్న ప్రతి ఐదు మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని తెలిపారు. 

పరిశోధకులు ప్రతి 100 మందిలో 20 శాతం ఈ సమస్యలతో బాధ పడుతున్నారని సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాళ్లలో కొందరిలో మతిమరపు కనిపిస్తుంటే మరి కొందరిలో మెదడు పనితీరులో అనేక మార్పులను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ పాల్ హరిసన్ మానసిక సమస్యలు ఎదురైతే హై రిస్క్ గా భావించాలని అన్నారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి వైద్యులు, శాస్త్రవేత్తలు మానసిక సమస్యలకు గల కారణాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని.. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని తెలుపుతున్నారు.

62 వేలకు పైగా కరోనా బాధితుల డేటాను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఆందోళన, ఒత్తిడి లేదా మతిమరుపు లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Exit mobile version