https://oktelugu.com/

చంద్రబాబు.. మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎత్తుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి సరైన సిద్ధాంతాలు పాటించని బాబుగారు.. మరో భారీ రాజకీయ కుట్రకు, మత విధ్వేషాలకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. రెండుకళ్ల సిద్ధాంతం ఈయనకు కొత్తేమీ కాదు.. రాష్ట్ర విభజన జరగకముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇటు ఉమ్మడి ఆంధ్ర ఫ్రదేశ్ ఉండాలంటూనే.. మరోవైపు తెలంగాణ కోసం దొంగ సంతకాలు చేసిన వ్యక్తి.. నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రజలు బాబును […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2021 / 10:03 PM IST
    Follow us on

    తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎత్తుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి సరైన సిద్ధాంతాలు పాటించని బాబుగారు.. మరో భారీ రాజకీయ కుట్రకు, మత విధ్వేషాలకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. రెండుకళ్ల సిద్ధాంతం ఈయనకు కొత్తేమీ కాదు.. రాష్ట్ర విభజన జరగకముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇటు ఉమ్మడి ఆంధ్ర ఫ్రదేశ్ ఉండాలంటూనే.. మరోవైపు తెలంగాణ కోసం దొంగ సంతకాలు చేసిన వ్యక్తి.. నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రజలు బాబును నమ్మకపోయినప్పటికీ.. బీజేపీ-జనసేనతో పొత్తుల సంసారంలో రాష్ట్రం విడిపోయిన తరువాత ఓసారి అధికారంలోకి రాగలిగాడు. రెండోసారి బాబును నమ్మని ప్రజలు చిత్తుగా ఓడించి.. జగన్ కు పట్టం కట్టారు.

    Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?

    ప్రస్తుతం తిరుపతిలో ఉప ఎన్నిక కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. అంటే సరిగ్గా రెండేళ్ల తరువాత మరోసారి రాజకీయ నేతలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని చెప్పవచ్చు. అంటే దాదాపు 20 నెలల కాలం తరువాత తమ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందనే పరీక్షించుకోవడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయ పార్టీల కళ్లన్నీ… తిరుపతి ఉప ఎన్నిక పైనే ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్న.. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించాలనే పార్టీలన్నీ… వ్యూహ.. పత్రివ్యూహాలు రచించుకుంటున్నాయి.

    ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించాలని యోచిస్తోంది. నియోజకవర్గం పరిధిలో ఇందుకు కావాలసిన ఏర్పాట్లను సైతం సిద్ధం చేసుకుంది. మొత్తం 700 ప్రాంతాల్లో పర్యటించేలా రూట్ మ్యాపు కూడా రెడీ చేసుకున్నారు. అయితే ఏ మతానికి తాము వ్యతిరేకం కాదని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ తిరుపతి కేంద్రంగా హిందువుల మనోభావాలను అస్త్రంగా చేసుకుని ఆత్మ పరిరక్షణ యాత్ర చేస్తోందని ప్రజలు అంటున్నారు. పదిరోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమం.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగమేనని పలువురు అంటున్నారు.

    Also Read: ఎడతెగని ‘పంచాయితీ’.. నిమ్మగడ్డకు షాక్.. సుప్రీంకు జగన్

    ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో.. హిందుత్వ వాదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ముద్రపడిన భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేలా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసేలా ఈ యాత్రను నిర్వహించతలపెట్టినట్లు చెబుతున్నారు. వచ్చేనెల 4వ తేదీ నుంచి రథయాత్రను చేపట్టడానికి టీడీపీ సన్నాహాలను చేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకూ ఈ యాత్రను నిర్వహించేలా ప్రణాళికను రూపొందించుకుంది.

    ఓ వైపు తాము అన్ని మతాలను సమానంగా చూస్తామంటున్న చంద్రబాబు.. ధర్మపరిరక్షణ యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు తమ కార్యకర్తలతో దేవాలయాలు కూల్చివేయిస్తూ… ప్రభుత్వంపై బురద జల్లుతున్న టీడీపీ పార్టీ… ధర్మ పరిరక్షణ యాత్ర పేరిట మరో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతుందనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్