https://oktelugu.com/

రూ.190కే అమెజాన్ లో ల్యాప్ టాప్ కొన్న వ్యక్తి.. చివరకు..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు ఒక కస్టమర్ భారీ షాక్ ఇచ్చాడు. అమెజాన్ నుంచి నష్టపరిహారంగా ఏకంగా 45 వేల రూపాయలు తీసుకున్నాడు. అమెజాన్ వెబ్ సైట్ లో ఎదురైన ఒక టెక్నికల్ సమస్య వల్ల అమెజాన్ కంపెనీ బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా ఈకామర్స్ కంపెనీలు తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేసేలా ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటాయి. కళ్లు చెదిరే ఆఫర్ల వల్ల చాలాసార్లు తక్కువ మొత్తానికే వస్తువులను పొందుతూ ఉంటారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 11:15 am
    Follow us on

    Amazon

    ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు ఒక కస్టమర్ భారీ షాక్ ఇచ్చాడు. అమెజాన్ నుంచి నష్టపరిహారంగా ఏకంగా 45 వేల రూపాయలు తీసుకున్నాడు. అమెజాన్ వెబ్ సైట్ లో ఎదురైన ఒక టెక్నికల్ సమస్య వల్ల అమెజాన్ కంపెనీ బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా ఈకామర్స్ కంపెనీలు తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేసేలా ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటాయి. కళ్లు చెదిరే ఆఫర్ల వల్ల చాలాసార్లు తక్కువ మొత్తానికే వస్తువులను పొందుతూ ఉంటారు.

    Also Read: ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

    అయితే కొన్ని సందర్భాల్లో సిబ్బంది చేసే తప్పుల వల్ల ఎక్కువ ధర ఉన్న వస్తువులు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తాయి. ఆ సమయంలో ఆర్డర్ చేస్తే గతంలో కొన్ని కంపెనీలు తక్కువ ధరలకే వస్తువులను ఇచ్చేసిన ఘటనలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రియో రంజన్ అనే వ్యక్తి 2014 సంవత్సరంలో అమెజాన్ నుంచి ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయడం కోసం వెతికాడు.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందా..?

    ఆ సమయంలో 23,499 రూపాయల విలువైన ల్యాప్ టాప్ కేవలం 190 రూపాయలకే కనిపించింది. వెంటనే సుప్రియో రంజన్ ఆ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేశాడు. అయితే ఆ తరువాత అమెజాన్ సుప్రియో రంజన్ చేసిన ఆర్డర్ ను రద్దు చేసింది. కస్టమర్ కేర్ ప్రతినిధులు టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ధర తక్కువగా చూపించిందని అందువల్ల తాము ఆ ప్రాడక్ట్ ఆర్డర్ ను రద్దు చేశామని పేర్కొన్నారు.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    ఆ తరువాత సుప్రియో రంజన్ ఒడిశా వినియోగ‌దారుల ఫోరంను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని రంజన్ కోరగా కొన్నేళ్ల విచారణ అనంతరం చివరకు అమెజాన్ బాధితుడికి నష్ట పరిహారం కింద 40 వేల రూపాయలు, ఖ‌ర్చుల కింద 5 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.