అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజం అని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చడంలో చంద్రబాబును మించిన నేత మరొకరు లేరు అన్నది రాజకీయవర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం.. అంతేకాదు.. చంద్రబాబును వసుదేవుడితో పోలుస్తుంటారు. అవసరార్థం ఎవరికాళ్లైనా పట్టుకొని చంద్రబాబు పనికానిచ్చుకుంటారని సెటైర్లు వేస్తుంటారు. అలాంటి చంద్రబాబు పోయిన ఎన్నికల వేళ కాంగ్రెస్ తో జట్టుకట్టి మోడీని ఓడించడానికి ఎక్కని విమానం లేదు.. తొక్కని గడపలేదంటారు. కానీ బ్యాడ్ లాక్..! చంద్రబాబు ఓడి మోడీ రికార్డ్ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కేంద్రంలో మోడీకి వంతపాడుతూ కాంగ్రెస్ ను కాలదన్నుతున్నాడు. అలాగే రాష్ట్రంలో మాత్రం తన మాట వినని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సాధిస్తున్నాడు.. తన మీడియాతో టార్గెట్ చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
రావడం రావడమే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని స్పష్టమైన ప్రకటన చేశారు. టీడీపీ, వైసీపీలకు దూరంగా జరిగిన జనసేనాని పవన్ తో కలిసి ముందుకెళుతున్నారు. దానర్థం.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని.. ప్రతిపక్ష టీడీపీని ఓడగొట్టి ఏపీలో అధికారం సాధించడం. ఇంత స్పష్టమైన ప్రకటన చేశాక కూడా.. సోము వీర్రాజుపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు..
*కన్నాలా బాబుకు లొంగకపోవడమే సోము టార్గెట్ అయ్యారా?
నిజానికి ఏపీ రాజకీయాల్లో సోము వీర్రాజుకు ముందున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు టీడీపీకి ఫేవర్ గానే రాజకీయం చేశారనే అపవాదును తెచ్చుకున్నారు. అధికార వైసీపీని టార్గెట్ చేసి టీడీపీ ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. అందుకే నాడు చంద్రబాబు, టీడీపీ మీడియా అప్పటి బీజేపీ అధ్యక్షుడు ‘కన్నా’ని ఆకాశానికి ఎత్తేసింది. వివిధ కారణాలతో కన్నాను తీసేసి సోము వీర్రాజును అధ్యక్షుడిని చేస్తే ఇదే టీడీపీ మీడియా మొసలి కన్నీరు కార్చింది.కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఇప్పుడు చంద్రబాబు, ఆయన మీడియా చెప్పినట్టు సోము వీర్రాజు వినడం లేదు. అటు టీడీపీని, ఇటు వైసీపీని ఇరుకునపెట్టేలా ఏపీలో ఉద్యమాలు చేస్తూ.. అన్యాయాలు ప్రశ్నిస్తూ ముందుకెళుతున్నారు. తన మాట వినని సోము వీర్రాజును ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ మీడియా టార్గెట్ చేసిందన్న ప్రచారం సాగుతోంది.
Also Read: స్థానిక ఎన్నికలకు గుజరాత్ నై.. ఇక్కడ సై అంట.!
*తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్న సోము
కేంద్రంలోని బీజేపీతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహం చేస్తోంది. సీఎం జగన్ మోడీషాలతో సాన్నిహిత్యం నెరుపుతున్నారు. కానీ ఏపీకి వచ్చేసరికి సీన్ రివర్స్. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్యమాలే చేస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం, విశాఖలో బీజేపీ నేతలపై దాడులపై సోము వీర్రాజు భగ్గుమన్నారు. వైసీపీపై యుద్ధం చేశారు.. టీటీడీలో అవకతవకలు, ట్రస్ట్ నిధులు, స్వామి ఆభరణాల విషయంలో.. అన్యమత ప్రచారంపై వైసీపీ సర్కార్ ను కడిగేశారు. ఇక జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏల పునః సమీక్షంచడం నిర్ణయాల్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకించింది. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు వీటిపై తీవ్ర స్థాయిలో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
ఇలా ఒక్కటేమిటీ వైసీపీ సర్కార్ ను బీజేపీ ఏపీలో చెడుగుడు ఆడేస్తోంది. ప్రతి నిర్ణయాన్ని ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటూ ఉద్యమిస్తోంది. ఇంత క్లియర్ కట్ గా వైసీపీని వ్యతిరేకిస్తున్నా సరే.. తాము చేయలేని పనిని బీజేపీ చేస్తుండడం.. టీడీపీని ప్రతిపక్షంగా కూడా లేకుండా చేస్తున్న బీజేపీ వైనంపై పచ్చ బ్యాచ్ కు నిద్ర కరువైంది. అందుకే బీజేపీపై ఈ అవాకులు చెవాకులు చేస్తూ విషప్రచారానికి పెద్ద పెద్ద స్కెచ్చులే గీస్తున్నారట…
* స్థానిక ఎన్నికలపై జగన్-సోము వీర్రాజు ఏకమయ్యారని టీడీపీ కుట్ర!
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని వైసీపీ కోరుతోంది. నిర్వహించాలని టీడీపీ అంటోంది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా నిర్వహించడానికి రెడీ అయ్యారు. దీనిపై నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో బీజేపీ తన స్టాండ్ క్లియర్ కట్ గా చెప్పింది. అయితే తాజాగా సోము వీర్రాజు ఎన్నికలను కొద్దిరోజులు వాయిదా వేయాలని సూచించారు. దానికి గల కారణాలను లేఖలో స్పష్టంగా వెల్లడించారు. కరోనా వైరస్ తీవ్రత, శీతాకాలం రావడంతో సెకండ్ వేవ్ తోపాటు ఏపీలో బీజేపీ బూత్ స్తాయి నుంచి పార్టీ నిర్మాణం దృష్ట్యా కాస్త తమకు సమయం ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు.
దీన్ని అందిపుచ్చుకున్న టీడీపీ పచ్చ మీడియా ‘జగన్ కు సోము వీర్రాజు ప్రేమలేఖలు’ పేరుతో ఓ తప్పుడు కథనాన్ని వండివార్చి విష ప్రచారం చేసింది. ఏపీలో బీజేపీ కనుక బూత్ స్థాయి నుంచి బలపడి కార్యవర్గం ఏర్పడితే టీడీపీ కూసాలు కదిలిపోతాయి. స్థానిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుంది. టీడీపీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుంది. వైసీపీని ఢీకొంటుంది. దీంతో ఇలా జరగకుండా టీడీపీ ఎత్తువేసిందంటున్నారు. అందుకే ఇప్పుడు స్థానిక ఎన్నికలను బీజేపీ వాయిదా వేయమనడం జగన్ కు లాభం చేకూర్చేందుకే అన్నట్టుగా టీడీపీ, ఆ మీడియా విష ప్రచారం మొదలుపెట్టింది. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది.
Also Read: చంద్రబాబులోనూ ట్రంప్ లక్షణాలు.. నెటిజన్ల ట్రోల్?
బలమైన మీడియా చేతుల్లో ఉన్నదని చంద్రబాబు, ఆయన వర్గం ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసింది. సోము వీర్రాజుకు స్వతహాగా దూకుడు ఎక్కువ. చంద్రబాబు సహా ఎవ్వరి మాట వినని మనిషి.. టీడీపీని, వైసీపీని ఏపీలో ఓడించేయాలనే ఆయన ప్లాన్ అర్తమవడంతో పచ్చ బ్యాచ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుకే వైసీపీతో లేని సంబంధాన్ని బీజేపీకి అంటకడుతూ అభాసుపాలు చేసే కుట్రకు తెరతీసింది. ఈ పచ్చపాతాన్ని ప్రజలు, బీజేపీ శ్రేణులు అర్థం చేసుకొని తిప్పికొట్టే రోజులు త్వరలోనే వస్తాయని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.
ఇంకా పాత చింతకాయపచ్చడి రాజకీయాలతోనే మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయాలను శాసించాలన్న కురువృద్ధుడు చంద్రబాబు ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. ఎందుకంటే మీడియా కంటే ప్రజలు తెలివైనా వారు. సోషల్ మీడియా అన్నింటిని ప్రజలు ముందు ఉంచుతుంది. వైసీపీ, బీజేపీ ఒక్కటయ్యారన్న టీడీపీ ప్రచారం ఒట్టి బుర్రకథ అని వారందరికీ తెలుసు. చంద్రబాబు ఆటలో అరటిపండుగా ఎవరూ కారు.. ఆయనే అరటితొక్కకు జారి పడడం ఖాయమని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.
-ఎన్నం