https://oktelugu.com/

బాబు ఎమోషనల్.. నన్ను కూడా చంపేయండి

పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీని ‘నిమ్మగడ్డ’ సాయంతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్తు తాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వినూత్న రాజకీయాలకు తెరతీశారు. వైసీపీ అంటేనే దుమ్మెత్తిపోసే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి నేపథ్యంలో చంద్రబాబు ఈ సరికొత్త సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రశ్నిస్తే వైసీపీ పాలనలో చంపేస్తున్నారని.. తనను కూడా చంపండి అంటూ మీడియా ముందర గోడు వెళ్లబోసుకున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2021 / 04:57 PM IST
    Follow us on

    పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీని ‘నిమ్మగడ్డ’ సాయంతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్తు తాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వినూత్న రాజకీయాలకు తెరతీశారు.

    వైసీపీ అంటేనే దుమ్మెత్తిపోసే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి నేపథ్యంలో చంద్రబాబు ఈ సరికొత్త సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రశ్నిస్తే వైసీపీ పాలనలో చంపేస్తున్నారని.. తనను కూడా చంపండి అంటూ మీడియా ముందర గోడు వెళ్లబోసుకున్నాడు.

    పట్టాభిపై తాజాగా కొందరి దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల కళ్లు నెత్తికెక్కాయని.. వాళ్లు ఏమైనా చేయగలమని ఈ దురాగతాలు చేస్తున్నారని విమర్శించారు.

    ఎంతమందిని చంపుతారని.. దమ్ముంటే నన్ను చంపేయండి అంటూ వైసీపీ నేతలను చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సీఎంకు.. బూతు మంత్రులకు ఇది సరికాదని హితవు పలికారు.. ఇంత బహిరంగంగా టీడీపీ నేతలపై దాడి చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారని.. పట్టాభికి వ్యక్తిగత విరోధులు ఎవరూ లేరని.. ఎవరు దాడి చేశారో అందరికీ తెలుసన్నారు.

    పోలీసులకు జగన్ జీతాలు ఇవ్వడం లేదని.. ప్రజల సొమ్మేనని.. చంపుతారా? నన్ను కూడా చంపండి అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.. ప్రజలు కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు కూడా బయటకు రాలేరని చంద్రబాబు హెచ్చరించారు.