https://oktelugu.com/

ఇప్పుడు రెడీ… అప్పుడు మెచ్యూరిటీ లేక నో చెప్పాను

టాలీవుడ్ లో ‘అ!’ లాంటి విలక్షణమైన కథతో మూవీ తీసి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూడవ చిత్రం ‘జాంబీ రెడ్డి’. ‘తేజ సజ్జ’ ఈ సినిమాతో సోలో హీరోగా సత్తా చాటేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హుషారు ఫేమ్ దక్షా నగార్కర్‌ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 / 04:29 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో ‘అ!’ లాంటి విలక్షణమైన కథతో మూవీ తీసి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూడవ చిత్రం ‘జాంబీ రెడ్డి’. ‘తేజ సజ్జ’ ఈ సినిమాతో సోలో హీరోగా సత్తా చాటేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హుషారు ఫేమ్ దక్షా నగార్కర్‌ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ దక్షా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

    Also Read: ‘ఇదే మా కథ’ టీజర్ చూసి హీరో అజిత్ ప్రశంసలు

    దక్షా నగార్కర్‌ మాట్లాడుతూ ‘‘ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇందులో నేను గేమర్ అయిన మ్యాగీ పాత్ర చేశా. బాడీ మీద టాటూలతో కొత్తగా కనిపిస్తా, యాక్షన్ సీన్స్ లో కూడా‌ చేశాను. నా పాత్రకు లవ్‌ ట్రాక్‌ ఏమీ లేదు. ప్రశాంత్‌ వర్మ కథ చెప్పినప్పుడే ఎగ్జైట్‌ అయ్యి వెంటనే చేస్తానని చెప్పేశాను. లాక్‌డౌన్‌కి ముందు కొంత చిత్రీకరణ చేసి, తర్వాత కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుని మిగతా సినిమా పూర్తి చేశాం” అని అన్నారు.

    Also Read: లవ్ స్టొరీ, టక్ జగదీష్ వివాదంలో క్లారిటీ

    బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజాగారి దర్శకత్వంలో మొదటి చిత్రం ‘హోరా హోరీ’ చేసే అవకాశం రావటంతో చేశానని చెప్పింది. చదువు కోసం సినిమాలకు కాస్త టైం గ్యాప్ ఇచ్చానని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించాను’’ అన్నారు. మొదట ప్రశాంత్‌ ‘అ!’లో నిత్యా మీనన్‌ పాత్రకు నన్నే సంప్రదించారు. ఆ టైం లో మెచ్యూరిటీ లెవల్స్ తక్కువగా ఉన్నందున నో చెప్పాను. ఇప్పుడైతే అలాంటి ఛాలెంజ్ రోల్ వస్తే తప్పకుండా చేస్తాను. ‘కల్కి’ మూవీలో కూడా నన్ను అడగగా, పర్సనల్ కారణాల వలన చేయలేకపోయానని అన్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.

    ఈ సారి మిస్ చేసుకోకూడదని జాంబీ రెడ్డి మూవీ చేశానని చెప్పుకొచ్చింది. ఆమె నెక్స్ట్ బెల్లంకొండ గణేశ్‌తో ఒక సినిమా, హిందీలో ఓ వెబ్‌ ఫిల్మ్‌ కమిట్‌ అయ్యాను’’ అన్నారు. మరో రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో రెండు సినిమాలు ఓకే అయ్యాయని వాటి గురించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. ఇకపోతే ‘జాంబీ రెడ్డి’ చిత్రంలో తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో నటించగా… రఘుబాబు, పృథ్వీ రాజ్, గెటప్‌ శ్రీను, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషించారు.