https://oktelugu.com/

మ‌హా స‌ముద్రం కోసం గోవాలో స్పెషల్ ‘సెట్’

RX 100 లాంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి నుండి రెండవ చిత్రంగా ‘మ‌హా స‌ముద్రం’ తెరకెక్కుతుంది. నెవెర్ బిఫోర్ కాంబినేషన్లో మల్టీ స్టార్రర్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, శర్వానంద్‌ లు హీరోలుగా చేయటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. లవ్ స్టోరీలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. Also Read: ఇప్పుడు రెడీ… అప్పుడు మెచ్యూరిటీ లేక నో […]

Written By:
  • admin
  • , Updated On : February 2, 2021 / 04:57 PM IST
    Follow us on


    RX 100 లాంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి నుండి రెండవ చిత్రంగా ‘మ‌హా స‌ముద్రం’ తెరకెక్కుతుంది. నెవెర్ బిఫోర్ కాంబినేషన్లో మల్టీ స్టార్రర్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, శర్వానంద్‌ లు హీరోలుగా చేయటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. లవ్ స్టోరీలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

    Also Read: ఇప్పుడు రెడీ… అప్పుడు మెచ్యూరిటీ లేక నో చెప్పాను

    ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం గోవా చెక్కేయనుంది. దాదాపుగా ముప్పై శాతం షూటింగ్ గోవాలోనే చేయాల్సి ఉండగా, గ్యాంగ్ స్టర్ డెన్ లాగ ఓ ప్ర‌త్యేమైన సెట్ ని గోవాలోనే వేస్తున్నారట. ప్రధాన పాత్రధారుల మధ్య వచ్చే కీలకమైన సన్నివేశాలన్నీ ఇక్కడే షూట్ చేస్త్తారట. త్వరగా షూట్ పూర్తి చేసి ప్రకటించినట్లుగా ఆగస్టు 19న రావాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: ‘ఇదే మా కథ’ టీజర్ చూసి హీరో అజిత్ ప్రశంసలు

    లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ కథానాయికలుగా కనువిందు చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోలకు సమానంగా ఇద్దరి హీరోయిన్ల క్యారెక్టర్లు ఉంటాయని చిత్రబృందం తెలిపింది. సినిమాలో శ‌ర్వా, సిద్ధార్ధ్‌ల పాత్ర‌లు స‌రికొత్త పంథాలో సాగుతాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ ‘పాయల్ రాజ్‏పుత్’ స్టెప్పులేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తుండగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్