కరోనా.. చాలా మంది ప్రాణాలు.. చాలా మందిని వ్యాధిగ్రస్తులను చేసింది. జనాల డబ్బులకు చిల్లులు పెట్టింది.కానీ ప్రకృతికి మేలు చేసింది. విర్రవీగిన మనిషిని ఇంట్లో కూర్చుండబెట్టి బుద్ది చెప్పింది. అలానే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పై కుట్రదారులు వేసిన కేసుల నుంచి కూడా ఉపశమనం కల్పించింది. కరోనా కారణంగా జగన్ కు గొప్ప ఊరట కలిగింది.
Also Read: చిక్కుల్లో చంద్రబాబు? అక్రమ ఆస్తుల కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు?
వైయస్ఆర్సి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రత్యేక కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా ఈ కేసు విచారణలో పెద్ద ఉపశమనాన్ని సీఎం జగన్ పొందారు. ఓ రకంగా జగన్ కు కరోనా ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. దేశంలోనూ కేసులు జట్ స్పీడుగా పరిగెడుతున్నాయి. ఈ క్రమంలోనే బయటకు వస్తే చాలు కరోనా బాగా విస్తరిస్తోంది. దీంతో అందరూ బయట కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో కోర్టులు కూడా తాజాగా ఊరటనిస్తున్నాయి. కరోనా విస్తరణ దృష్ట్యా హైదరాబాద్ కోర్టులో సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి సిబిఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. దీంతో సీఎం జగన్ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యే బాధ తప్పినట్టైంది.
ప్రతి శుక్రవారం సీఎం జగన్ పై పెట్టిన కేసులు విచారణకు వస్తుంటాయి. వీటికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి ఆయన బిజీగా ఉండడం.. ప్రజాసేవలో తరలిస్తుండడంతో వీలు పడడం లేదు. ఇక వీటి వల్ల ప్రజా పాలన, సమీక్షలు, అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. ఈ క్రమంలోనే కోవిడ్-19 కారణంగా జగన్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసుల నుంచి విచారణ వాయిదా పడింది.
అయితే సుప్రీంకోర్టు తాజాగా నేతలపై కేసుల విషయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ శుక్రవారం కోర్టు మళ్లీ విచారణను ప్రారంభించింది.. జగన్ విజయవాడలో ఉన్నందున హాజరు కాలేదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతి ద్వారా జగన్ హాజరు అవుతారని ఆయన తరుఫుల న్యాయవాదులు అభ్యర్థించారు. సిబిఐ కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించి సీఎం జగన్ కు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు విజయవాడ నుంచే హాజరు అవుతారు.
Also Read: మరో బాంబు పేల్చిన రఘురామా? ఆ మగ్గురు జైలుకేనట?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఈ కేసులో వైయస్ఆర్సి ప్రధాన కార్యదర్శి వి విజయ్ సాయిరెడ్డితో సహా ఇతర నిందితులకు కూడా ఇదేరకమైన మినహాయింపు ఇవ్వబడింది. దీంతో వీరందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణకు హాజరు కానున్నారు. కాగా జగన్ కేసు తదుపరి విచారణ కోసం అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేసింది.
ప్రస్తుతం జగన్ కేసులలో సీబిఐ దాఖలు చేసిన నాలుగు చార్జిషీట్లలో విచారణపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు ఈ స్టే కేసులపై విచారణను నవంబర్ 9 వరకు వాయిదా వేసింది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడంతో ఇక ఏపీలో పరిపాలనకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు వచ్చి హాజరయ్యే పని తప్పింది. ఓ రకంగా కరోనా జగన్ కు ఊరటనిచ్చిందనే చెప్పాలి.