https://oktelugu.com/

నిమ్మగడ్డ యాక్షన్ వెనుకున్నది ఆయనేనా?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వివాదం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ సర్కారు.. ఏపీ ఉద్యోగులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటుంటే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం తన పంథాని మార్చుకోవడం లేదు. ఎంతమంది ఇది సరైన సమయం కాదని చెబుతున్నా.. ముందుకు సాగుతున్నారు. శనివారం సైతం ఉద్యోగ సంఘాల నేతలు.. సీనియర్ అధికారులు రమేశ్ కుమార్ కు వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని చెబుతున్నా.. అంతా నా ఇష్టం అన్నట్లుగానే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2021 6:07 pm
    Follow us on

    Nimmagadda Chandrababu

    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వివాదం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ సర్కారు.. ఏపీ ఉద్యోగులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటుంటే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం తన పంథాని మార్చుకోవడం లేదు. ఎంతమంది ఇది సరైన సమయం కాదని చెబుతున్నా.. ముందుకు సాగుతున్నారు. శనివారం సైతం ఉద్యోగ సంఘాల నేతలు.. సీనియర్ అధికారులు రమేశ్ కుమార్ కు వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని చెబుతున్నా.. అంతా నా ఇష్టం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి .. ప్రజాస్వామ్యానికి వారధిగా నిలవాల్సిన ఎస్ఈసీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    Also Read: ‘రిజర్వేషన్లు’.. బీసీల నోట్లో మట్టియేనా?

    పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు విన్నవించినా.. పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ మేరకు హైకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికల నోటిఫికేషన్ ను సైతం వెలువరించారు. కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తానంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. అయితే కరోనాతో ఏం కాదంటున్న నిమ్మగడ్డ నిన్న మీడియా ముందుకు మాత్రం పూర్తిస్థాయిలో కోవిడ్ జాగ్రత్తలో రావడం.. తన టేబుల్ ముందర గ్లాస్ ఏర్పాటు చేసుకోవడం చూసి విలేకరులు సైతం ముక్కున వేలేసుకున్నారు. మీకు ఒక న్యాయం.. ఏపీ ప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నించుకున్నారు. కరోనా ప్రజలకు సోకదా అని నిలదీస్తున్నారు.

    నిమ్మగడ్డ విలేకరుల సమావేశంలో తన ముందు గాజు గ్లాస్ ఏర్పాటు చేసుకోవడం చూసిన పలువురు ఉద్యోగులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం విలేకరుల సమావేశానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న రమేశ్ కుమార్…. మరి లక్షల మందితో కలిసిపోయి.. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల విషయంలో ఎందుకు ఇలా ఒంటెద్దు పోకడతో ముందుకు పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు.. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో అతడికి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆయనది ఒక్కరిదే ప్రాణామా..? జనాలది కాదా..? అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు నిమ్మకుండి పోయిన రమేశ్ కుమార్ తీరా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలంటూ.. హడావుడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తన షోడో అయిన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. నిమ్మగడ్డ ప్రజలతో ఆడుతున్న రాజకీయ నాటకంగా అభివర్ణిస్తున్నారు.

    Also Read: సర్పంచ్‌ పదవికి అర్హతలు.. అనర్హతలు ఇవీ!

    కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ఎన్నిలకు తీసుకుంటున్న చర్యలు ఏమిటీ..? జాగ్రత్తలు.. ఏర్పాట్లు.. తదితర అంశాలపై మీడియాకు వివరించాల్సిన ఎస్ఈసీ ఇందుకు భిన్నంగా చంద్రబాబు రాసినట్టుగా.. కేవలం స్క్రిప్టు చదివి వెళ్లిపోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్