‘రిజర్వేషన్లు’.. బీసీల నోట్లో మట్టియేనా?

అటు కేంద్రప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు ఇప్పుడు అగ్రవర్ణాల్లోని (ఓసీ) పేదలకు 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.కేంద్రంలోని బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే ఈ వరం ప్రకటించగా.. తెలంగాణ సర్కార్ ఇప్పుడు మేల్కొంది. మోడీతో భేటి తర్వాత కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేసేస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఆయుష్మాన్ భారత్, ఇప్పుడు 10శాతం రిజర్వేషన్లు, మరిన్ని కేంద్ర పథకాలకు రాష్ట్రంలో […]

Written By: NARESH, Updated On : January 24, 2021 6:11 pm
Follow us on

అటు కేంద్రప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు ఇప్పుడు అగ్రవర్ణాల్లోని (ఓసీ) పేదలకు 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.కేంద్రంలోని బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే ఈ వరం ప్రకటించగా.. తెలంగాణ సర్కార్ ఇప్పుడు మేల్కొంది. మోడీతో భేటి తర్వాత కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేసేస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఆయుష్మాన్ భారత్, ఇప్పుడు 10శాతం రిజర్వేషన్లు, మరిన్ని కేంద్ర పథకాలకు రాష్ట్రంలో పచ్చజెండా ఊపారు.

Also Read: సర్పంచ్‌ పదవికి అర్హతలు.. అనర్హతలు ఇవీ!

ఈ క్రమంలోనే ఈ 10శాతం రిజర్వేషన్లతో తెలంగాణ సమాజంలో వచ్చే మార్పులేమిటి? వచ్చే లాభాలేంటి? ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న చర్చ మేధావుల్లో సాగుతోంది. అయితే అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతున్నా రిజర్వేషన్ల వల్ల తెలంగాణలోని బీసీలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన ఆ వర్గంలో నెలకొంది.

ఇక రిజర్వేషన్ల విషయంలో అందరూ ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మసక చూపిస్తున్న వైనం కనిపిస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.. మీడియా, ప్రభుత్వం, దాని తాబేదార్లు
కళ్ల ముందట అంకెల గారడీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మోసం ఎట్లా చేస్తారో ఈ లెక్కలు చూస్తే తెలుస్తుందని ఉదాహరణతో సహా లెక్కలు విప్పుతున్నారు.

2014లో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన సమాచారాన్ని అప్పుడు పత్రికల్లో తెలంగాణలో జనాభా శాతాన్ని ప్రకటించారు. అయితే ఇందులోనే ట్విస్ట్ ఉంది.

ఇందులో బిసిలు -51%
ఓసీలు – 21%
ఏస్సీలు -18%
ఎస్టీలు -7%
మైనారిటీలు -14%
టోటల్ జేస్తే.. -111% వస్తుంది.. (రౌండ్ ఫిగర్ 100శాతాన్ని దాటేస్తోంది)

Also Read: కేసీఆర్ ఫోకస్ ‘సౌత్’.. టార్గెట్ ఫిక్స్

అంటే తెలంగాణ జనాభా విషయంలో ఏదో గోల్ మాల్ జరుగుతుందన్నది ఇక్కడ అందరూ అంగీకరించాల్సిన విషయం. 10 శాతమున్న ఓసీలను 21 శాతంగా చూపించారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ పది శాతం రిజర్వేషన్లతో కేవలం రెండు శాతం ఉన్న ఓసీల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. అంటే అర్హులయిన వారి కన్నా 8 శాతం అధికంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్న విషయం ఇక్కడ బోధపడుతోంది.

మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. అంతకు ముందు పంచాయితీ ఎన్నికల్లో 50 రిజర్వేషన్లు దాటొద్దని బీసీలకు ఇదే తెలంగాణ సర్కార్ మొండి చెయ్యి చూపించింది. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే తమిళనాడు మాదిరిగా రిజర్వేషన్లను పెంచి వాటిని సుప్రీం కోర్టు ప్రశ్నించడానికి వీలు లేకుండా రాజ్యాంగం లోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తెలంగాణలోని బలమైన ఓసీ సామాజికవర్గం కోసం బీసీలను బలి చేస్తున్నారన్న ఆవేదన ఆ వర్గంలో వ్యక్తమవుతోంది. అగ్రవర్ణ రిజర్వేషన్లతో అంతిమంగా బీసీలకు నష్టం.. ఓసీలకు లాభం అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్