కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో 50 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో బుధవారం పదో విడత చర్చల్లో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది.
Also Read: ఫేస్ బుక్ యూజర్లకు అలర్ట్.. లైక్ బటన్ కనిపించదట..!
రైతు, ప్రతినిధులతో ఉమ్మడిగా కమిటీ వేసి వ్యవసాయచట్టాల్లో అభ్యంతరాలపై అధ్యయనం చేద్దామని కేంద్రమంత్రులు ప్రతిపాదించారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు సాగుచట్టాల అమలును ఏడాదిన్నర వరకు వాయిదా వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.దీనిపై చర్చించుకొని నిర్ణయం చెప్పాలని రైతు సంఘాలను కేంద్రమంత్రులు కోరారు.
అయితే సాగు చట్టాల రద్దుపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనపై తాము చర్చించుకొని నిర్ణయం చెబుతామన్నారు.
Also Read: వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?
అనంతరం ఈ చర్చలు మరోసారి ఎల్లుండి 22వ తేదికి వాయిదాపడ్డాయి. రైతుల కమిటీ నిగ్గుతేల్చేవరకు ఏడాదిన్నర పాటు అమలును కేంద్రం నిలిపివేస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ మీడియా ఎదుట వెల్లడించారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని.. రైతులు ఆందోళన విరమించాలని కోరారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్