https://oktelugu.com/

అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణం.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది..

అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్ అన్నారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా తాజాగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. Also Read: టెంపర్ ట్రంప్.. వైట్ హౌస్ ఖాళీ చేసి పరార్! సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ స్వయంగా జోబైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్ పై బైడెన్ ప్రమాణం చేశారు. అమెరికా అధ్యక్ష చరిత్రలోనే అత్యంత […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2021 / 11:30 PM IST
    Follow us on

    అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్ అన్నారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా తాజాగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు.

    Also Read: టెంపర్ ట్రంప్.. వైట్ హౌస్ ఖాళీ చేసి పరార్!

    సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ స్వయంగా జోబైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్ పై బైడెన్ ప్రమాణం చేశారు.

    అమెరికా అధ్యక్ష చరిత్రలోనే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జోబైడెన్ కొత్త రికార్డు సృష్టించాడు.

    ఈ సందర్భంగా జోబైడెన్ మాట్లాడుతూ.. ఇది అమెరికా ప్రజలందరి విజయం అని.. అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారని.. కానీ అమెరికన్లే ఓటుతో మరోసారి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని జోబైడెన్ అన్నారు.

    తనకు ఓటు వేసినా.. వేయకున్నా.. అమెరికన్లందరూ తనవారేనని.. ప్రతి అమెరికన్ కోసం తాను పాటు పడుతానని జోబైడెన్ హామీ ఇచ్చారు.. అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చి సుపరిపాలన అందిస్తానన్నారు.

    Also Read: బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం స్పీచ్‌ డ్రాఫ్ట్‌ చేసింది తెలంగాణ కుర్రాడే..

    అన్నింటికంటే ఇప్పుడు కరోనా అమెరికాకు పెద్ద శత్రువు అని..దాన్ని పక్కా ప్రణాళికతో తరిమికొట్టి దేశానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకొస్తామని జోబైడెన్ హామీ ఇచ్చారు.

    అంతకుముందు.. ఇక అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణం చేశారు. భారతీయ మూలాలున్న కమలా అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా రికార్డు సృష్టించారు. ఆమెను చూసి దేశమంతా గర్విస్తోంది. తమిళనాడులోని ఆమె పూర్వీకుల స్వస్థలంలో సంబరాలు మిన్నంటాయి.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు