ఏపీలో మూడు రాజధానులు చేయాలని పట్టుదలతో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పాలనలో ఆ పనిచేయడానికి పట్టుదలతో ముందుకెళుతున్నాడు. కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుకుగా కర్నూలు జిల్లాకు ఏపీ హైకోర్టును తరలించాలని యోచిస్తున్నారు. అయితే అంశంపై హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడంతో ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోకి ఈ అంశం వెళ్లింది.
Also Read: పీఆర్సీపై కూల్ అయ్యారా..! : ఆ ఫిట్‌మెంట్ కూడా ఇప్పట్లో లేనట్లేనా..?
తాజాగా ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై ఈరోజు రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు.
ఏపీ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 ఫిబ్రవరి నెలలో హైకోర్టు తరలింపుకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారని మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టుతోపాటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
Also Read: విశాఖ రైల్వేజోన్ కథ ముగిసినట్లేనా..?
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తరలింపుపై ఏపీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం స్పష్టం చేసింది.
హైకోర్టు పరిపాలనా బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని మంత్రి రవిశంకర్ గుర్తు చేశారు. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో ఏపీ హైకోర్టు, ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని.. తరలింపు గడువు తేది ఏదీ లేదని.. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్