నాకు భద్రత పెంచండి..: కేంద్రానికి విన్నవించుకున్న రేవంత్‌

రేవంత్‌రెడ్డి.. ఆయనో ఫైర్‌‌ బ్రాండ్‌. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి.. ఈ పార్టీలో పెద్దగా సపోర్టు దొరకడం లేదు. సీనియర్లు ఎక్కువగా కావడంతో ఎవరి గ్రూపులు వారివే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ రేసులో కూడా ఉన్నారు. ఆయనకు ఆ పదవి ఎక్కడ దక్కుతుందోనని సీనియర్లు అడ్డుకుంటూనే ఉన్నారు. Also Read: సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం..: కేంద్రంపై వెల్లువెత్తుతున్న విమర్శలు అయితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఆందోళన పెరుగుతోందట. తనకు పీసీసీ […]

Written By: Srinivas, Updated On : February 4, 2021 2:53 pm
Follow us on


రేవంత్‌రెడ్డి.. ఆయనో ఫైర్‌‌ బ్రాండ్‌. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి.. ఈ పార్టీలో పెద్దగా సపోర్టు దొరకడం లేదు. సీనియర్లు ఎక్కువగా కావడంతో ఎవరి గ్రూపులు వారివే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ రేసులో కూడా ఉన్నారు. ఆయనకు ఆ పదవి ఎక్కడ దక్కుతుందోనని సీనియర్లు అడ్డుకుంటూనే ఉన్నారు.

Also Read: సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం..: కేంద్రంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

అయితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఆందోళన పెరుగుతోందట. తనకు పీసీసీ చీఫ్‌ పదవి దక్కనీయకుండా అందరూ కలిసి ఏమైనా చేస్తారన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓ సందర్భంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ఉదంతాన్ని గుర్తు చేసి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ ఉదంతాన్ని పోల్చారో కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. తనను చంపడానికే కేసీఆర్ ఫిక్సయ్యారని ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు.

అందుకే.. ఆయన సెక్యూరిటీ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాక.. ఆయనకు భద్రతను పూర్తిగా తొలగించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం కేటాయించాల్సిన భద్రతను కేటాయించారు కానీ.. అది సరిపోదని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే తనకు మరింత సెక్యూరిటీ కావాలని ఆయన గతంలో న్యాయస్థానాల్లో కూడా పిటిషన్లు వేశారు. చివరికి అనుకూలంగా తీర్పు కూడా తెచ్చుకోగలిగారు. కానీ.. అమలు చేయాల్సిన ప్రభుత్వం ఏదో కారణంతో ఆయనకు సెక్యూరిటీని తెలంగాణ సర్కార్ కల్పించడంలేదు.

Also Read: మదనపల్లి జంట హత్యల్లో మరో కోణం

దీంతో నేరుగా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కార్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని.. గతంలో కేసీఆర్ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ వ్యాఖ్యల్ని అమిత్ షాకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు చెప్పినా భద్రత కల్పించడం లేదని… కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆయన కోరుతున్నారు. రేవంత్ భద్రత విషయంలో బీజేపీకి కూడా ఎలాంటి పట్టింపులు లేవు. అందుకే.. ఆయన వినతిపత్రాన్ని అమిత్ షా పట్టించుకుంటారని అనుకోవడం లేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్