సూపర్ స్టార్ మహేష్ బాబు – పరుశురామ్ కలయికలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఇందులో మహేశ్‌బాబు తన అసిస్టెంట్స్‌తో ఉండగా.. దర్శకుడు పరశురామ్ మాత్రం మండుటెండలో నేలపై కూర్చొని ఏదో రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సినిమా కోసం మొత్తానికి దర్శకుడు తెగ కష్ట పడుతున్నాడు. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. వృత్తిపట్ల పరశురామ్‌కు ఉన్న నిబద్ధతను ఈ ఫోటో తెలియజేస్తోంది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే
అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా అభివర్ణిస్తుంటారు. జీవితాన్ని త్యాగం చేసి మరీ ఎన్నో ఇబ్బందులను, మరెన్నో ఒడుదొడుకులను చిరునవ్వుతో స్వీకరిస్తుంటాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదని, ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారని.. మొదట అనిల్ ఒప్పుకోకపోయినా.. నమ్రతా బలవంతంతో అంగీకరించాడని వార్తలు వచ్చాయి. అయితే నిజంగానే అనిల్ కపూర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటించబోతున్నాడు. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమాలో మెయిన్ కంటెంట్ అని, మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు.
Also Read: ‘మహా నటి’ ఖాతాలో మరో అరుదైన ఘనత
కాగా లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్