2జి, 3జి, 4జి.. ఇప్పుడు 5జీ..

2జి, 3జి, 4జి…. ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి సుపరిచతమైన పదాలే ఇవి. 4జిని పూర్తిగా అప్ గ్రేడ్ కాకముందే దాన్ని తలదన్నేలా 5జి టెక్నాలజీ రానుంది. 2021 వరకు దేశం మొత్తం 5జి టెక్నాలజీ ని ప్రవేశపెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది. ఇంకా జనాలు 4జీనే సరిగ్గా వాడడం లేదు. ఇంకా అందరి చేతిలో 2జీ ఫోన్లే ఉన్నాయి. రిలయన్స్ జియో 4జీ తో సంచలనాలు సృష్టిస్తున్నా 4జీ ఫోన్లు కొనే […]

Written By: NARESH, Updated On : December 16, 2020 8:44 pm
Follow us on

2జి, 3జి, 4జి…. ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి సుపరిచతమైన పదాలే ఇవి. 4జిని పూర్తిగా అప్ గ్రేడ్ కాకముందే దాన్ని తలదన్నేలా 5జి టెక్నాలజీ రానుంది. 2021 వరకు దేశం మొత్తం 5జి టెక్నాలజీ ని ప్రవేశపెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది.

ఇంకా జనాలు 4జీనే సరిగ్గా వాడడం లేదు. ఇంకా అందరి చేతిలో 2జీ ఫోన్లే ఉన్నాయి. రిలయన్స్ జియో 4జీ తో సంచలనాలు సృష్టిస్తున్నా 4జీ ఫోన్లు కొనే స్థోమత గ్రామాల్లోని పేదలు, రైతులకు లేక చాలామంది 2జీనే వాడుతున్నారు. ఇతర టెలికాం కంపెనీలు కూడా 4జీ టెక్నాలజీని అందిస్తున్న ఇంకా జనాలు అప్ గ్రేడ్ కావడం లేదు. దీంతో 4జీనే కునారిల్లుతున్న వేళ… 5జీ రాబోతోంది..

5జి టెక్నాలజీ తో ఇప్పుడున్న స్పీడ్ కన్నా హై డేటా స్పీడ్ అంటే 20 జిబిపిఎస్ (గిగా బైట్స్ పర్ సెకండ్ ) వరకు పొందే అవకాశం ఉంది. 2018 లో అధికారికంగా దీన్ని మార్కెట్ లోకి తీసుకొద్దామనుకున్నా సాధ్యపడలేదు. ఇప్పుడు కేంద్రం 2021లో లాంచ్ చేయబోతోంది.

తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రైతులకు సబ్సిడీల నిర్ణయంతోపాటు 5జీ వేలానికి రంగం సిద్ధం చేసింది. 5జీ స్పెక్ట్రం వేలం వేయాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ వేలానికి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు.

20 ఏళ్ల వ్యాలిడిటీ పీరియడ్ తో వివిధ ఫ్రీక్వెన్సీ బ్రాండ్లలో 4జీ స్పెక్ట్రంను మార్చిలో వేలం నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా 3,92,332.70 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనావేస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.