నిన్ననే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మళ్లీ బీజేపీతో స్నేహానికి అడుగులు వేసిన సీఎం కేసీఆర్ ను తెలంగాణలో ప్రశాంతంగా ఉండనీయడం లేదు కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మళ్లీ కొత్త పంచాయితీని తెరపైకి తెచ్చాడు. మరోసారి హిందుత్వ ఎజెండాతోనే కేసీఆర్ కు వార్నింగ్ ఇవ్వడం విశేషం.
Also Read: టీపీసీసీ రేస్.. పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేకపాయే..!
హైదరాబాద్లోని పాతబస్తీపై జీహెచ్ఎంసీ ఎన్నికలవేళ సర్జికల్ స్ట్రైక్ చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేశవ్యాప్తంగా దుమారం రేపాడు. ఇప్పుడు పాతబస్తీలోని హిందూ ఆలయాలు, ఆలయ భూముల పరిరక్షణకు నడుం బిగించారు. తాజాగా సీఎం కేసీఆర్ కు 24 గంటల డెడ్ లైన్ విధించారు.
పాతబస్తీలోని ఆలయాల భూముల పరిరక్షణపై సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాతబస్తీలోని కబ్జా భూములను స్వాధీనం చేసుకొని దేవాదాయశాఖకు అప్పగించాలని.. 24 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ చేసే ఉద్యమానికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
Also Read: రిజిస్ట్రేషన్ ఓ ప్రసహనం.. ప్రజల్లో అసహనం
పోస్టింగులు, రివార్డులు, అవార్డుల కోసం పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిలువరిస్తున్నారని.. తాము ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్