https://oktelugu.com/

మారుతున్న వీర్రాజు స్వరం.. కారణమేంటి?

నిన్నటిదాకా రాజధాని అమరావతిలో ఉండటం వేస్ట్ అన్నట్టుగానే వ్యవహరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఉన్నట్టుండి మాట మార్చేశారు. అంతటితో ఆగకుండా.. ఏపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు.. కూడా ఇలాంటి ప్రకటనలే చేసేవారు. దీంతో ఆయన చంద్రబాబు ట్రాప్‌లో ఉన్నారని.. వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. Also Read: టీపీసీసీ రేస్.. పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేకపాయే..! సాఫ్ట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 8:39 pm
    Follow us on

    Somu Veerraju
    నిన్నటిదాకా రాజధాని అమరావతిలో ఉండటం వేస్ట్ అన్నట్టుగానే వ్యవహరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఉన్నట్టుండి మాట మార్చేశారు. అంతటితో ఆగకుండా.. ఏపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు.. కూడా ఇలాంటి ప్రకటనలే చేసేవారు. దీంతో ఆయన చంద్రబాబు ట్రాప్‌లో ఉన్నారని.. వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు.

    Also Read: టీపీసీసీ రేస్.. పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేకపాయే..!

    సాఫ్ట్ గా కౌంటర్..
    అయితే.. సోము వీర్రాజుకు మాత్రం సాఫ్ట్ గా కౌంటర్ ఇస్తున్నారు. వీర్రాజు తన పార్టీ మేనిఫెస్టో చదువుకోవాలని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైకోర్టును కర్నూలులో పెడతామని వారి మేనిఫెస్టోలోనే ఉందని అన్నారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అమరావతికి, రాయలసీమకూ సోము వీర్రాజు నిధులు తీసుకొస్తే సంతోషిస్తామన్నారు.

    Also Read: తిరుపతితోపాటే ‘సాగర్’కు ఉప ఎన్నిక..?

    సోము వ్యాఖ్యల్లో ఆంతర్యమేంటి?
    అమరావతిని తరలించడానికి అంగీకరించేది లేదంటూ వీర్రాజు ఇప్పటి వరకూ కుండ బద్ధలు కొట్టలేదు. కానీ.. హఠాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయడంతో దాని వెనక ఆంతర్యం ఏంటనే చర్చ మొదలైంది. చాలా మంది అయితే.. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీని ఏదో ఒకటి అనాలి కాబట్టి, అది కూడా బలంగా ఉండాలి కాబట్టి, ఈ రాజధాని విషయాన్ని ఎత్తుకున్నారని అంటున్నారు. ప్రస్తుతానికైతే.. ఆయనకు సాఫ్ట్ గానే కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మరి, భవిష్యత్ లో సోము తీరు ఎలా ఉంటుంది? వైసీపీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అన్నది చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్