https://oktelugu.com/

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

కరోనా కల్లోలంలో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఊరటనిచ్చింది. కనీసం అప్పు తీసుకునే అవకాశం కల్పించింది. తల్లి పెట్టక అడుక్కు తిననివ్వక ఇవ్వక ఇన్నాళ్లు కేంద్రం రాష్ట్రాలకు అప్పులు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సంస్కరణలు చేశాక అనుమతిచ్చింది. అప్పులు తీసుకొని బతకండని ఊరటనిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల కారణంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కరోనా లాక్ డౌన్ తో ఎదురైన కష్టకాలంలో ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2020 / 07:14 PM IST
    Follow us on

    కరోనా కల్లోలంలో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఊరటనిచ్చింది. కనీసం అప్పు తీసుకునే అవకాశం కల్పించింది. తల్లి పెట్టక అడుక్కు తిననివ్వక ఇవ్వక ఇన్నాళ్లు కేంద్రం రాష్ట్రాలకు అప్పులు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సంస్కరణలు చేశాక అనుమతిచ్చింది. అప్పులు తీసుకొని బతకండని ఊరటనిచ్చింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల కారణంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కరోనా లాక్ డౌన్ తో ఎదురైన కష్టకాలంలో ఉన్న కేసీఆర్, జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఏపీ ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చేలా ఉపశమనం కలిగించింది. కుదేలైన ఏపీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిసి రూ.16728 కోట్లు తీసుకునే వీలుంది. ఈ ఐదు రాష్ట్రాలకు విద్యుత్ రంగ సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థలు, ఒకే దేశం-ఒకే రేషన్, అమలు చేసినందుకు గాను ఈ అదనపు రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

    తెలంగాణ రాష్ట్రానికి రూ.2508 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ కు రూ.2525 కోట్లు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసినందుకు కేంద్రం ఈ రుణాలను తీసుకునే అవకాశం ఇచ్చింది.