కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో ఈ ఏడాది మార్చి నెల 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల వ్యాపారులు నెలల తరబడి షాపులను మూసేయాల్సి వచ్చింది. వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా కేంద్రం తీసుకున్న నిర్ణయం కావడంతో వ్యాపారులు షాపులను నెలల తరబడి క్లోజ్ చేశారు. లాక్ డౌన్ నిర్ణయం వల్ల వ్యాపారులకు తీవ్రంగా నష్టాలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో వైరస్ వల్ల ఇప్పటికీ లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి.
Also Read: నగరాన్ని శాసిస్తున్న వీధి కుక్కలు.. పట్టించుకునే వారేరీ?
అయితే ఒక వ్యాపారి లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి షాపు తెరవలేదు. 9 నెలల తరువాత తాజాగా షాపును ఓపెన్ చేయగా షాపులోని వస్తువులు, నగదు మాయం కావడంతో వ్యాపారి షాక్ అయ్యాడు. కోల్ కతా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే చింతామణి మోని అనే 74 సంవత్సరాల వ్యాపారి లాక్ డౌన్ ను అమలు చేయడంతో సొంతూరైన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ కు వెళ్లాడు.
Also Read: 400 ఏళ్ల తర్వాత నేడే ఆకాశంలో అద్భుతం.. ఏ సమయంలో చూడాలంటే..?
లాక్ డౌన్ నిబంధనలు, ఇతర కారణాల వల్ల ఆ వ్యాపారి మళ్లీ కోల్ కతాకు రావాలని అనుకున్నా సాధ్యం కాలేదు. 9 నెలల తరువాత వ్యాపారి కోల్ కతాకు తిరిగి వచ్చి చూడగా షాపులో విలువైన వస్తువులు మాయం కావడంతో పాటు నగదు కూడా కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోని వ్యాపారి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో షాపులో దొంగతనం జరిగిందని సమాచారం ఇచ్చాడు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
చింతామణి మోని సైకిల్ షాపు, సెల్ ఫోన్ షాపు నిర్వహిస్తుండగా లక్షల్లో విలువ చేసే మొబైళ్లు, డబ్బు మాయమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే దొంగతనం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.