ఆ దేశ కోర్టు సంచలన నిర్ణయం.. విడాకులు తీసుకుంటే ఇంటి పనికి పరిహారం..?

చైనా దేశంలోని ఒక కోర్టు తాజాగా వెల్లడించిన ఒక తీర్పు ఆ దేశంలో కొత్త చర్చకు కారణమవుతోంది. కోర్టు ఒక కేసులో విడాకులు తీసుకుంటే భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వెల్లడించిన ఈ తీర్పును కొందరు సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మహిళల పని పట్ల కోర్టుకు ఇంత చిన్నచూపా..? అని కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం మహిళల శ్రమను […]

Written By: Kusuma Aggunna, Updated On : February 24, 2021 7:16 pm
Follow us on

చైనా దేశంలోని ఒక కోర్టు తాజాగా వెల్లడించిన ఒక తీర్పు ఆ దేశంలో కొత్త చర్చకు కారణమవుతోంది. కోర్టు ఒక కేసులో విడాకులు తీసుకుంటే భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వెల్లడించిన ఈ తీర్పును కొందరు సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మహిళల పని పట్ల కోర్టుకు ఇంత చిన్నచూపా..? అని కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం మహిళల శ్రమను ఇప్పటికైనా గుర్తించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చైనా ఈ మేరకు కొత్త సివిల్ కోడ్ ను అమలులోకి తీసుకువచ్చింది. భరణం కాకుండా అదనంగా ఈ పరిహారాన్ని పొందవచ్చు. విడాకులు కోరే జంటల్లో భార్యలు ఇంట్లో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే భార్యలు ఇంటి పనికి పరిహారం పొందవచ్చు. ఈ ఏడాది నుంచే ఈ మేరకు చట్టం అమలులోకి రానుంది. ఐదు సంవత్సరాల క్రితం చెన్ వాంగ్ దంపతులకు వివాహం జరగగా ఈ దంపతులు కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు.

విడాకులు తీసుకున్న సమయంలో కోర్టు ఆమెకు భరణం ఇప్పించగా వాంగ్‌ కొత్త చట్టం ప్రకారం ఇంటి పనులు చేసినందుకు ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించాలని కోరుతూ ఆమె బీజింగ్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆమె ఐదు సంవత్సరాలు పని చేసిందుకు 5,56,937.15 రూపాయలు వాంగ్ చేసిన ఇంటి పనికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. ఈ తీర్పు గురించి ఒక న్యాయవాది మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

జంట వైవాహిక జీవితం, ఇంటి పని, ఆదాయం, స్థానిక జీవన వ్యయం, ఇతర అంశాల ఆధారంగా పరిహారాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రకారం చైనా దేశ మహిళలు రోజుకు 4 గంటలు ఇంటి పనుల కోసం కేటాయిస్తున్నారు.