ఏపీ సీఎం జగన్.. ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వార్ ఎపిసోడ్ లో గొప్ప ట్విస్ట్ నెలకొంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఈరోజు ఏపీ ఉన్నతాధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలిసి విన్నవించారు. అయినా కూడా నిమ్మగడ్డ ఈరోజు ఏకంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేయడం సంచలనంగా మారింది.
Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 27న రెండో దశ ఎన్నికలకు.. ఈనెల 31న మూడో దశ ఎన్నికలకు.. ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయితీ, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయితీ ఎన్నికలు.. ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయితీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తారు.
Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. జగన్ ఒప్పుకుంటారా?
శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. దీంతో రేపటి నుంచే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేయడానికి.. కొత్తగా ప్రకటించడానికి బ్రేక్ పడనుంది.
అయితే సీఎం జగన్ ప్రభుత్వం ఎంత వద్దంటున్నా.. కేంద్రం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రెడీ అవుతున్నా.. ఏపీలో డ్రైరన్ జరుగుతున్నా కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెడీ కావడం సంచలనమైంది. మరి దీన్ని జగన్ ప్రభుత్వం నిర్వహిస్తుందా? లేదా అన్నది తేలనుంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్