ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఈ డెబిట్ కార్డ్ తో భారీ లాభాలు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. ఐఓసీఎల్ భాగస్వామ్యంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా కాంటాక్ట్ లెస్ రూపే డెబిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కాంటాక్ట్ లెస్ రూపే కార్డులపై గతంలో పరిమితి 2,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఆ పరిమితి 5,000 రూపాయలకు పెరిగిన సంగతి తెలిసిందే. Also Read: […]

Written By: Kusuma Aggunna, Updated On : January 9, 2021 11:57 am
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. ఐఓసీఎల్ భాగస్వామ్యంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా కాంటాక్ట్ లెస్ రూపే డెబిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కాంటాక్ట్ లెస్ రూపే కార్డులపై గతంలో పరిమితి 2,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఆ పరిమితి 5,000 రూపాయలకు పెరిగిన సంగతి తెలిసిందే.

Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. డిపాజిట్ కు రెట్టింపు డబ్బులు పొందే ఛాన్స్..!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఎస్బీఐ జతకట్టి తెచ్చిన ఈ కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రివార్డు పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. కనీసం 200 రూపాయల పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఆయిన్ పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ లను కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

Also Read: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవాళ్లకు శుభవార్త.. ఫ్రీగా రూ. లక్ష ప్రయోజనాలు..?

కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా వన్ టైమ్ పాస్ వర్డ్ కూడా అవసరం లేకుండా సులభంగా లావాదేవీలు జరపవచ్చనే సంగతి తెలిసిందే. ఎన్.ఎఫ్.సీ టెర్మినల్స్ దగ్గర కాంటాక్ట్ లెస్ కార్డును ఉంచి సులభంగా బిల్లును చెల్లించవచ్చు. ట్యాప్ అండ్ పే టెక్నాలజీ ద్వారా పని చేసే ఈ కార్డుల ద్వారా సులభంగా లావాదేవీలను జరపడం సాధ్య్మవుతుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా సులభంగా కాంటాక్ట్ లెస్ కార్డులను పొందవచ్ఛు.

మరిన్ని వార్తల కోసం: జనరల్

కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా టికెట్ బుకింగ్ చేసినా, ఇతర బిల్లుల చెల్లింపులు చేసినా కూడా రివార్డు పాయింట్ల రూపంలో క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. తరచూ పెట్రోల్, డీజిల్ లను కొనుగోలు చేసేవాళ్లకు ఈ కార్డు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.