బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం మరో మలుపు తిరిగింది. విశాఖపట్నం నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వైసీపీలో చేరుతారంటూ ఊహాగానాలు వస్తున్న తరుణంలో ‘విశాఖ స్టీల్ ఉద్యమానికి మద్దతుగా’ గంటా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. Also Read: మా గ్రామాలను తెలంగాణలో కలపండి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ […]

Written By: NARESH, Updated On : February 6, 2021 4:21 pm
Follow us on

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం మరో మలుపు తిరిగింది. విశాఖపట్నం నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వైసీపీలో చేరుతారంటూ ఊహాగానాలు వస్తున్న తరుణంలో ‘విశాఖ స్టీల్ ఉద్యమానికి మద్దతుగా’ గంటా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది.

Also Read: మా గ్రామాలను తెలంగాణలో కలపండి

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తన సొంత దస్తూరీతో శాసనసభ స్పీకర్ కు పంపినట్లు తెలిపారు.

ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని గంటా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే..

Also Read: బాబు పెద్ద స్కెచ్చే వేస్తున్నారుగా..!

చెప్పినట్టే ఈ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు గంటా ప్రకటించారు. ఇదిప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లోనే సంచలనమైంది. గంటా బాటలోనే మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకునేలా చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏపీ బీజేపీని ఇరకాటంలో నెడుతోంది.

ఇప్పటికే విశాఖ ఉక్కు ఉద్యమానికి ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ మద్దతు తెలిపాయి. జనసేన సైతం బీజేపీతో వ్యతిరేకించింది. ఈ ప్రైవేటీకరణ ఏపీలో బీజేపీకి దెబ్బగా పలువురు పరిణమిస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్