https://oktelugu.com/

చరణ్ తో నాని డైరెక్టర్ ‘కథాకహానీ’ !

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కథతో ఒప్పించాడా ? చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నాడా ?. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ ప్రకారం గౌతమ్ తిన్ననూరి చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని అన్నాడని.. వచ్చే ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని.. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 6, 2021 / 04:03 PM IST
    Follow us on


    దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కథతో ఒప్పించాడా ? చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నాడా ?. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ ప్రకారం గౌతమ్ తిన్ననూరి చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని అన్నాడని.. వచ్చే ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని.. ఈ సినిమాకి ‘కథాకహానీ’ అనే సరికొత్త టైటిల్ ను పెట్టబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: ఈ ఆదివారం తెలుగు లోగిళ్ళల్లోకి ఫుల్ ఫన్ !

    కాగా క్రేజీ ఎమోషనల్ బ్యాక్‌ డ్రాప్‌ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఎలాగూ గౌతమ్, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి కాబట్టి.. సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. పైగా గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. పైగా గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. దీంతో గౌతమ్ తిన్ననూరికి పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తోంది.

    Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్ !

    అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ముఖ్యంగా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు అలాగే తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోన్నట్లు గౌతమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. ఇక షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొని ఉంది. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్