https://oktelugu.com/

మా గ్రామాలను తెలంగాణలో కలపండి

స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేవని.. వాటిని తెలంగాణలో కలపాలని ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల గిరిజన రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. Also Read: బాబు పెద్ద స్కెచ్చే వేస్తున్నారుగా..! జిల్లా కేంద్రమైన నాందేడ్‌కు తాము 300కి.మీ దూరంలో ఉన్నామని, అందువల్ల తమ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2021 / 03:18 PM IST
    Follow us on


    స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేవని.. వాటిని తెలంగాణలో కలపాలని ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల గిరిజన రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

    Also Read: బాబు పెద్ద స్కెచ్చే వేస్తున్నారుగా..!

    జిల్లా కేంద్రమైన నాందేడ్‌కు తాము 300కి.మీ దూరంలో ఉన్నామని, అందువల్ల తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో భాషా ప్రాతిపాదిక రాష్ట్రాల ఏర్పాటుతో మహారాష్ట్రలో కలిసిన తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రపతిని కలిసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

    Also Read: ఇక హైదరాబాద్‌లోనూ ఆకాశహర్మ్యాలు

    1956లో భాషా ప్రాతిపాదిక రాష్ట్రాల ఏర్పాటుతో మహారాష్ట్రలో కలిసిన తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు. కాగా, తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని నయ్‌గావ్‌, బోకర్‌, డెగ్లూర్‌, కిన్వట్‌, హథ్‌గావ్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్